Ind Vs Pak World Cup 2023 : క్రికెట్లో టీమ్ఇండియా - పాకిస్థాన్ మ్యాచులకు ఉన్న క్రేజే వేరు. ఇరు దేశాల ప్రజలే ప్రేక్షకులే కాదు.. యావత్ ప్రపంచం ఆసక్తితో చూస్తుంది. ప్రతి మ్యాచ్‌లో మొదటి బంతి మొదలు.. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. అయితే ఈ వన్డే ప్రపంచ కప్ ఇండియాలో జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికోసం ఇప్పటికే పాక్ జట్టు హైదరాబాద్ వచ్చి బస చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న ఆ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే గతంలో మన దేశంలో పర్యటించారనే విషయం మీకు తెలుసా ?
ఇప్పటికే వన్డే ప్రపంచ కప్ - 2023 ప్రారంభమైంది. మొదటిసారిగా ఇండియా సొంతంగా ఈ టోర్నీని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భారత జట్టు ఈ నెల 8న ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్, సెప్టెంబర్ 11న రెండో మ్యాచ్ ఆడి.. విజయం సాధించింది. మూడో మ్యాచ్ పాకిస్థాన్‌తో మ్యాచ్ ఈ నెల 14న ఉంది. గుజరాజ్‌లోని అహ్మదాబాద్‌లో ఇది జరగనుంది. అందరీ కళ్లు మ్యాచ్ పైనే ఉన్నాయి.
అయితే.. పాక్ జట్టు ఇండియా గడ్డపై అడుగు పెట్టి ఏడేళ్లు అవుతోంది. గతంలో ఈ రెండు దేశాల జట్లు పలు ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం పరస్పరం పర్యటనలు చేసేవి. కానీ కొంత కాలంగా ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంక్షోభం తీవ్రరూపం దాల్చడంతో ఇవి ఆగిపోయాయి. ప్రస్తుతం.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఐ)లు నిర్వహించే పెద్ద టోర్నమెంట్లలో రెండు జట్లు తలపడుతున్నాయి. పాకిస్థాన్ జట్టు చివరి సారిగా షాహిద్ అఫ్రిది నేతృత్వంలో 2016లో టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు వచ్చింది. పాక్ గతంలో జట్టుగా ఇండియాలో పర్యటించక ఏడు సంవత్సరాలు అవుతుంది. చివరిసారిగా టీ 20 వరల్డ్ కప్ కోసం వచ్చింది.
2016 తర్వాత.. అంటే సరిగ్గా ఏడేళ్ల అనంతరం ఇప్పుడు వన్డే ప్రపంచ కప్ కోసం ఆ టీమ్ ఇండియాలో అడుగుపెట్టింది. ఇందులో భాగంగా తమ తొలి మ్యాచ్‌ను అక్డోబరు 6న ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో ఆడింది. 15 మందితో కూడిన ఆ టీమ్‌లో ఇద్దరు ఆటగాళ్లకు మాత్రమే గతంలో ఇండియాలో పర్యటించిన అనుభవముంది. వారే మహమ్మద్ నవాజ్, సల్మాన్ అలీ అఘా. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఇండియాకు వచ్చిన పాక్ జట్టులో మహమ్మద్ నవాజ్ కూడా ఉన్నాడు. అయితే.. అతనికి ఆ సమయంలో తుది జట్టులో చోటు దక్కక ఒక్క మ్యాచ్ లోనూ ఆడలేదు. ఒక సల్మాన్ అలీ అఘా 2014లో ఇండియాకు వచ్చాడు. కానీ అప్పుడు పాక్ జాతీయ జట్టు తరఫున కాదు. ఆ ఏడాది జరిగిన ఛాంపియన్స్ లీగ్ లో లాహోర్ లయన్స్ టీమ్ తరఫున ఆడేందుకు వచ్చాడు. ఆ లీగ్ లో బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఒక మ్యాచ్ ఆడాడు. వీరిద్దరికి తప్ప.. జట్టులోని మిగతా సభ్యులకు ఇండియాలో పర్యటించిన, టీమిండియాతో ఆడిన అనుభవం పెద్దగా లేదు.
-
Touchdown Ahmedabad 🛬
— Pakistan Cricket (@TheRealPCB) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📹 Capturing the journey, featuring a surprise in-flight celebration 🤩#CWC23 | #DattKePakistani | #WeHaveWeWill pic.twitter.com/qxe0mO9p8X
">Touchdown Ahmedabad 🛬
— Pakistan Cricket (@TheRealPCB) October 11, 2023
📹 Capturing the journey, featuring a surprise in-flight celebration 🤩#CWC23 | #DattKePakistani | #WeHaveWeWill pic.twitter.com/qxe0mO9p8XTouchdown Ahmedabad 🛬
— Pakistan Cricket (@TheRealPCB) October 11, 2023
📹 Capturing the journey, featuring a surprise in-flight celebration 🤩#CWC23 | #DattKePakistani | #WeHaveWeWill pic.twitter.com/qxe0mO9p8X