ETV Bharat / sports

కేఎల్ రాహుల్​పై మళ్లీ సెటైర్లు.. మీమ్స్​తో ఓ ఆటాడేసుకున్న నెటిజన్లు!

ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు కేెఎల్ రాహుల్​ను తప్పించడంపై సోషల్​మీడియాలో మీమ్స్​ పోటెత్తాయి. నెటిజన్లు వాటిని బాగా ట్రెండ్ చేశారు. వాటిని మీరు ఓ సారి చూసేయండి..

KL Rahul funny memes
కేఎల్ రాహుల్​పై మళ్లీ సెటైర్లు.. మీమ్స్​తో ఓ ఆటాడేసుకున్న నెటిజన్లు
author img

By

Published : Mar 1, 2023, 7:46 PM IST

ఎట్టకేలకు క్రికెట్​ అభిమానులు, మాజీలు అనుకున్నట్లే జరిగింది. చాలా కాలంగా ఫామ్‌ లేమితో పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న కేఎల్‌ రాహుల్‌ను.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌కు తప్పించారు. అతడి స్థానంలో ఓపెనర్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ఆడాడు. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ అతడు మూడు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 20, 17, 1 పరుగులే చేశాడు. దీంతో తుది జట్టు నుంచి అతడిని తప్పించాలని వాదనలు ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా మాజీ పేసర్‌ వెంకటేశ్‌.. టీమ్​మేనేజ్​మెంట్​పై కాస్త గట్టిగానే విమర్శలు చేశాడు. చాలా మంది ప్లేయర్స్​ టీమ్​లో స్థానం కోసం ఎదురుచూస్తుంటే.. రాహుల్‌కు పదే పదే అవకాశాలు ఎందుకు ఇస్తున్నారంటూ తెగ ప్రశ్నించాడు. రాహుల్ గణాంకాలను తెలుపుతూ సెటైర్లు వేశాడు. ఈ క్రమంలోనే మూడో టెస్టుకు రాహుల్​ను తప్పిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. గిల్​ను అడించింది. దీంతో నెట్టింట మీమ్స్‌ సందడి ఎక్కువైపోయింది. కేఎల్‌ రాహుల్‌ను తప్పించారని తెలియగానే సోషల్​మీడియాలో ఎక్కడ చూసిన ఈ విషయంపైనే మీమ్స్ కనిపించాయి.

కేఎల్‌ను టీమ్​ నుంచి తప్పించారని తెలియగానే మొట్టమొదట ఈ భూమ్మీద ఎక్కువగా సంతోషపడే వ్యక్తి.. వెంకటేశ్‌ ప్రసాదే అయ్యుంటాడని అని మీమర్స్​ రచ్చ రచ్చ చేశారు. 'హమ్మయ్య వెంకటేశ్‌ ప్రసాద్‌ ఇక హ్యాపీ' అంటూ మరి కొంతమంది నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతూ ట్రోల్స్​ చేశారు. ఈ విషయం తెలీయగానే వెంకటేశ్‌ ప్రసాద్‌ ఇలా డ్యాన్స్‌ చేసి ఉంటాడేమో అంటూ సరదా వీడియోలను పోస్ట్​ చేశారు. ఇంకొంతమంది కేఎల్‌ రాహుల్‌ గత ఆటతీరును ఉద్దేశిస్తూ ట్వీట్లు పోస్ట్ చేశారు. ఓసారి వాటిని చూసేయండి..

ఇకపోతే ఈ మూడో టెస్టు తొలి రోజు ఆటవిషయానికొస్తే.. ఆట పూర్తయ్యే సమయానికి ఆసీస్​ 47 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్​లో నాలుగు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఉస్మాన్​ ఖ్వాజా(60) అర్ధ శతకంతో మెరిశాడు. ఆ తర్వాత మార్నస్​ లబుషేన్​(31), స్టీవ్​ స్మిత్​(26) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ చేయలేదు. ఇకపోతే టీమ్​ఇండియా బౌలర్లలో​ జడేజా ఒక్కడే నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్​ స్పిన్నర్ల ధాటికి టీమ్​ఇండియా 33.2 ఓవర్లలోనే కేవలం 109 పరుగులు చేసి ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్ విరాట్​ కోహ్లీ, యంగ్​ ప్లేయర్​ శుభమన్​ గిల్ కూడా తమ జట్టును ఆదుకోలేకపోయారు. ఆసీస్​ బౌలర్లలో కున్​మెన్​ ఐదు వికెట్లు తీయగా... లైయన్​ మూడు వికెట్లు, మర్ఫీ ఒక్క వికెట్​ దక్కించుకున్నాడు.

ఇదీ చూడండి: తొలి రోజు ఆట పూర్తి.. జడ్డూ 4 వికెట్లు.. ఆసీస్​ ఆధిక్యం ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.