ETV Bharat / sports

South Africa vs Netherlands World Cup 2023 : ప్రపంచకప్​లో మరో సంచలనం.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన నెదర్లాండ్స్

South Africa vs Netherlands World Cup 2023 : 2023 వరల్డ్​కప్​లో నెదర్లాండ్స్​ సంచలన విజయం సాధించింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో 38 పరుగుల తేడాతో గెలుపొందింది.

South Africa vs Netherlands World Cup 2023

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 11:04 PM IST

Updated : Oct 18, 2023, 6:56 AM IST

South Africa vs Netherlands World Cup 2023 : సౌతాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్​ సంచలన విజయం సాధించింది. ధర్మశాల స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్​లో 38 పరుగుల తేడాతో గెలుపొంది వరల్డ్​ కప్​లో ఖాతా తెరిచింది. 246 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రిగా మొదటి నుంచీ తడబడింది. 207 పరుగులకే ఆలౌట్​ అయి ఓడిపోయింది. దక్షిణాఫ్రిగా బ్యాటర్లలో డేవిడ్​ మిల్లర్ (43) రాణించాడు. ఓపెనర్​ డికాక్​ (20), క్లాసెన్ (28), జెరాల్డ్ (22) ఓ మోస్తరు ప్రదర్శన చేశారు. నెదర్లాండ్స్​ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్​ 3, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, బాస్ డి లీడే​ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కొలిన్ ఒక వికెట్ తీశాడు.

మొదట టాస్​ ఓడి బ్యాటింగ్​ దిగిన నెదర్లాండ్స్..​ వర్షం కారణంగా మ్యాచ్​ను 43 ఓవర్లకు కుదించగా.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. స్కాట్ ఎడ్వర్డ్స్ (78) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (29), ఆర్యన్ దత్​ (23*), తేజ నిడమనూరు (20), మాక్స్ ఓడౌడ్ (18) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, జాన్​సెన్, రబాడ తలొ రెండు వికెట్ల పడగొట్టారు. గెర్లాడ్​, మహరాజ్​ ఒక్కో వికెట్ తీశారు.

ICC World Cup Schedule 2023 : వరుసగా రెండు మ్యాచ్​లు ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న నెదర్లాండ్స్​.. ఆడిన రెండు మ్యాచ్​లూ గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను ఓడించి వరల్డ్​ కప్​లో బోణీ కొట్టింది. ప్రస్తుతం భారత్​ 6 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతోంది. రెండో ప్లేస్​లో న్యూజిలాండ్ ఉంది. చెన్నైలోని ఎమ్​ఏ చిందంబరం స్టేడియం వేదికగా బుధవారం న్యూజిలాండ్- అప్గానిస్థాన్​ మధ్య మ్యాచ్​ జరగనుంది. అయితే ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోన్న న్యూజిలాండ్​ ఈ మ్యాచ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలుస్తుంది.

ODI World Cup SL vs AUS : శ్రీలంక చెత్త రికార్డ్​.. వెన్నునొప్పితోనే ఆ జట్టును బెంబేలెత్తించిన ఆసీస్​ ప్లేయర్

ODI World Cup 2023 : 'భారత్‌ను ఓడించడం కత్తిమీద సామే.. కానీ రోహిత్​ ఉంటే మాత్రం..'

Last Updated : Oct 18, 2023, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.