ODI World cup 2023 England : ప్రపంచ కప్ 2023లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది ఆప్గానిస్థాన్. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరిని ఆశ్చర్య పరిచింది. ఈ ఓటమితో మరొక చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్రపంచ కప్ చరిత్రలో అన్ని టెస్ట్ ప్లేయింగ్ జట్ల చేతుల్లో ఓడిన మొదటి టీమ్‌గా నిలిచింది. 1975 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ కప్‌ల్లో ఏదొక మ్యాచ్‌ల్లో 11 జట్ల చేతుల్లో పరాజయం పొందింది. ఇలా అన్ని టీమ్స్‌పై ఒక్కసారైన ఓడిపోయిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది.
- 1975 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్ ఓటమిని చవి చూసింది.
- 1979లో వరల్డ్‌కప్ ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో పరాజయం పొందింది.
- 1983, 1987 ప్రపంచకప్‌ల్లో భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్ చేతుల్లో ఓడింది ఇంగ్లాండ్.
- 1992లో జింబాబ్వే చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
- 1996లో శ్రీలంక, సౌతాఫ్రికా టీమ్స్‌తో తలపడి ఇంగ్లాండ్ ఓడిపోయింది.
2011లో ఐర్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ ఓటమి పాలైంది.
- 2015 ఎడిషన్‌లో బంగ్లాదేశ్‌తో ఓటమిని ఎదుర్కొంది.
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ 2023లో ఆఫ్గానిస్థాన్ చేతుల్లో ఘోరంగా పరాభవం ఎదురైంది. ఈ ఓటమితో 11 దేశాల జట్టులతో తలపడి పరాజయాన్ని పొందిన దేశంగా ఇంగ్లాండ్ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. మొత్తంగా ఈ వరల్డ్ కప్ 2023లో ఇంగ్లాండ్ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. ఆడిన మూడింటిలో ఒక మ్యాచ్ మాత్రమే గెలించింది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఓడగా.. రెండో మ్యాచ్ బంగ్లాదేశ్ పై గెలిచింది. మూడో మ్యాచ్‌లో అప్గాన్‌పై ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.
-
Defeat in Delhi.
— England Cricket (@englandcricket) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
#EnglandCricket | #CWC23 pic.twitter.com/tCdsfYNKXD
">Defeat in Delhi.
— England Cricket (@englandcricket) October 15, 2023
#EnglandCricket | #CWC23 pic.twitter.com/tCdsfYNKXDDefeat in Delhi.
— England Cricket (@englandcricket) October 15, 2023
#EnglandCricket | #CWC23 pic.twitter.com/tCdsfYNKXD
ODI World CUP 2023 AFG VS ENG : ఇకపోతే అప్గాన్ - ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. 69 పరుగులు తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం 285 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలి ఘోర ఓటమిని అందుకుంది.
ODI World cup 2023 Rashid Khan : నాడు విలన్.. నేడు హీరో.. డిఫెండింగ్ ఛాంపియన్‌పై అదరగొట్టేశాడు!
ODI WorldCup 2023 AFG VS ENG : జగజ్జేత ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆప్గానిస్థాన్.. ప్రపంచకప్‌లో సంచలనం