NED vs BAN World Cup 2023 : 2023 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. నెదర్లాండ్స్ నిర్దేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదించలేకపోయింది. 42.2 ఓవర్లలో కేవలం 142 పరుగులు చేసి కుప్పకూలింది. మెహదీ హసన్ మిరాజ్ (35) రాణించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహ్మదుల్లా (20), ముస్తఫిజుర్ రెహ్మాన్ (20) ఫర్వాలేదనిపించారు. మోహదీ హసన్ (17), తాంజిద్ హసన్ (15) పరుగులు చేయగా.. లిట్టన్ దాస్ (3), నజ్ముల్ హొస్సేన్ శాంటో (9), షకీబ్ అల్ హసన్ (5), ముష్ఫికర్ రహీమ్ (1) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. నెదర్లాండ్స్ బౌలర్లలో పాల్ మీకెరెన్ నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు. బాస్ దీలీడ్ రెండు వికెట్లు తీయగా.. ఆర్యన్ దత్, లోగాన్ వాన్ బీక్, కొలిన్ తలో వికెట్ పడగొట్టారు.
-
Netherlands pulled off yet another stellar win in #CWC23 as they beat Bangladesh at Eden Gardens 🤩#NEDvBAN 📝: https://t.co/bpEMQYWRLE pic.twitter.com/uwatzb9hdx
— ICC Cricket World Cup (@cricketworldcup) October 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Netherlands pulled off yet another stellar win in #CWC23 as they beat Bangladesh at Eden Gardens 🤩#NEDvBAN 📝: https://t.co/bpEMQYWRLE pic.twitter.com/uwatzb9hdx
— ICC Cricket World Cup (@cricketworldcup) October 28, 2023Netherlands pulled off yet another stellar win in #CWC23 as they beat Bangladesh at Eden Gardens 🤩#NEDvBAN 📝: https://t.co/bpEMQYWRLE pic.twitter.com/uwatzb9hdx
— ICC Cricket World Cup (@cricketworldcup) October 28, 2023
మొదటి నుంచి నెమ్మదిగా ఆడిన ఓపెనర్ లిట్టన్‌దాస్‌ను నెదర్లాండ్స్ బౌలర్ ఆర్యన్ దత్ నాలుగో ఓవర్‌లో పెవిలియన్ పంపించాడు. వాన్ బీక్ వేసిన తర్వాతి ఓవర్‌లో మరో ఓపెనర్ తాంజిద్ హసన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన నజ్ముల్, షకీబ్ కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. 70 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి బంగ్లా కష్టాల్లో పడగా.. మహ్మదుల్లా, మెహదీ హసన్ నిలకడగా ఆడటం వల్ల స్కోరు 100 దాటింది. ఆ తర్వాత వీరిద్దరూ ఔటయ్యారు. చివరకు ముస్తాఫిజుర్ (20; 35 బంతుల్లో 2 x4, 1 x6) పోరాడినా ఫలితం లేకపోయింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో ఓపెనర్లు విక్రమ్‌జిత్ సింగ్ (3), మాక్స్ ఔడౌడ్ (0) సింగిల్ డిజిట్ స్కోరుకే తేలిపోయారు. స్కాట్ ఎడ్వర్డ్స్ (68; 89 బంతుల్లో 6x4), వెస్లీ బరేసి (41; 41 బంతుల్లో 8 x4) రాణించగా.. సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (35; 61 బంతుల్లో 3x4) ఫర్వాలేదనిపించాడు. కోలిన్ అకెర్మాన్ (15), బాస్ డీ లీడే (17) పరుగులు చేశారు. చివర్లో వాన్ బీక్ (23; 16 బంతుల్లో 2x4, 1x6) దూకుడుగా ఆడి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో నెదర్లాండ్స్ ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, షోరిపుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రహ్మన్, మెహదీ హసన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ తీశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Aus vs Nz World Cup 2023 : హోరాహోరీ మ్యాచ్‌లో ఆసీస్‌దే పైచేయి.. ఉత్కంఠభరిత పోరులో 5 పరుగుల విక్టరీ