ICC ODI World cup 2023 squad : వన్డే ప్రపంచకప్ 2023 ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది 13వ ఎడిషన్ కావడం విశేషం. ఐసీసీ డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం.. ఈ మెగా టోర్నీ ఆక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం... జూన్ 27న బిగ్ అనౌన్స్మెంట్ ఉండనుందని తెలిసింది.
ముంబయిలో జూన్ 27 ఉదయం గం. 11.30లకు ఐసీసీ ప్రెస్ మీట్ నిర్వహించి ఆ అనౌన్స్మెంట్ చెప్పనుందట. దీంతో ఆ రోజే షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకుంటున్నారు. అలాగే షెడ్యూల్‌తో పాటు ఈ వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్లు.. తమ పూర్తి వివరాలను ప్రకటించడానికి ఆగస్టు 29వ తేదీని డెడ్‌లైన్‌గా విధించే అవకాశం ఉందని తెలిసింది. దీంతో ఆయా క్రికెట్ బోర్డులు తమ జట్లను ఖారారు చేయడానికి, వాటికి సంబంధించిన వివరాలను సమర్పించడానికి ఇంకా దాదాపు రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. వీటితో పాటు ప్రపంచకప్ నిబంధనలు, ఇంకా మొదలైన వాటి గురించి కూడా అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిసింది.
ICC ODI World cup 2023 teams : మొత్తం 10 జట్లతో.. ఈ వన్డే ప్రపంచకప్‌లో మొత్తం పది జట్లు పాల్గొననున్నాయి. ఇప్పటికే టీమ్ఇండియాతో పాటు పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు నేరుగా ఈ వరల్డ్ కప్‌కు అర్హత సాధించాయి. మరో రెండు జట్ల కోసం.. ప్రస్తుతం జింబాబ్వే వేదికగా క్వాలిఫయర్ టోర్నీ జరుగుతోంది. ఈ పోరులో ఫైనల్‌కు చేరిన జట్లు.. వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి.
BCCI New chief selector : మరో 60 రోజులు.. ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు.. తమ వివరాలను సమర్పించడానికి 60 రోజుల గడువు మిగిలి ఉంది. అయితే బీసీసీఐ ఇటీవలే .. కొత్త చీఫ్ సెలెక్టర్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అంటే చీఫ్ సెలెక్టర్‌ను నియమించడానికి బోర్డుకు ఇంకా 60 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
ఇటీవలే ఫిబ్రవరిలో చేతన్ శర్మ.. సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత నాలుగు నెలలు ఆ పదవిలో ఎవరూ లేరు. ఆ కుర్చీ ఖాళీగానే ఉంది. అనంతరం చేతన్ శర్మ స్థానంలో.. సెలక్షన్ ప్యానల్‌లో సభ్యుడైన శివ్‌సుందర్ దాస్‌ను తాత్కాలిక ఛీప్ సెలెక్టర్‌గా బోర్డు ఎంపిక చేశారు. అయితే ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబరు మధ్యలో ఆసియకప్ జరగనుంది. దీనికి ముందే బోర్డు.. కొత్త చీఫ్ సెలెక్టర్‌ను ఎంపిక చేసే పనిలో ఉందని తెలిసింది.
ఇదీ చూడండి :
బీసీసీఐ యూటర్న్.. వరల్డ్‌కప్‌నకు ముందు 2సార్లు భారత్ x పాక్ ఢీ!
'అయ్యో.. నేను అలా అనలేదు'.. 'హైబ్రిడ్ మోడల్'పై మాట మార్చిన పీసీబీ కొత్త బాస్