ICC Latest ODI Ranking : అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు.. అగ్రస్ధానానికి చేరుకుంది. శ్రీలంక వేదికగా అప్ఘానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన పాక్(Pakistan ODI Ranking).. మరోసారి నెం.1 వన్డే జట్టుగా ఘనతను అందుకుంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టింది. ఇప్పుడు పాక్ 118.48 రేటింగ్‌తో నిలవగా.. ఆస్ట్రేలియా 118 రేటింగ్‌తో ఉంది. పాయిట్లు పరంగానూ ఆస్ట్రేలియా(2714) కన్నా పాకిస్థాన్ (2725) ముందంజలో ఉంది.
ఇక టీమ్ఇండియా(Team India ODI Ranking) విషయానికి వస్తే.. ఈ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్ధానంలో కొనసాగుతోంది. రేటింగ్స్ పరంగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా కంటే ఐదు పాయింట్లు వెనుకపడింది. 4,081 పాయింట్లతో 118 రేటింగ్‌తో కొనసాగుతోంది. న్యూజిలాండ్ 104 రేటింగ్స్‌తో నాలుగో స్థానంలో ఉండగా.. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, అప్ఘానిస్తాన్, వెస్టిండీస్ ఉన్నాయి.
Pakistan VS Afghanistan 3rd ODI : కాగా, కొలాంబో వేదికగా జరిగిన మూడో వన్డేలో.. 59 పరుగుల తేడాతో అప్ఘానిస్థాన్‌ను ఓడించింది పాకిస్థాన్. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో పాక్ క్లీన్‌స్వీప్ చేసింది. ఫలితంగా ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 268 స్కోర్ చేసింది. మొహ్మద్ రిజ్వాన్ (67), కెప్టెన్ బాబర్ ఆజమ్ (60) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోగా, ఆగా సల్మాన్ (38*), నవాజ్ (30) పర్వాలేదనిపించారు. నైబ్, ఫరీద్ చెరో 2 వికెట్లు తీశారు.
ఆ తర్వాత లక్ష్య ఛేదనలో అప్ఘానిస్థాన్ టీమ్... 48.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. అప్ఘాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ (37 బంతుల్లో 64) సూపర్ ఫాస్ట్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. తన టీమ్‌ను గెలిపించుకోలేకపోయాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు తీయగా.. నవాజ్, అఫ్రిది,అష్రాప్ తలో రెండు వికెట్లను దక్కించుకున్నారు.
-
✅ Series whitewash
— ICC (@ICC) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
✅ No.1 Ranking
Pakistan get a huge boost ahead of #CWC23 💪https://t.co/ZTPebG5f2I
">✅ Series whitewash
— ICC (@ICC) August 26, 2023
✅ No.1 Ranking
Pakistan get a huge boost ahead of #CWC23 💪https://t.co/ZTPebG5f2I✅ Series whitewash
— ICC (@ICC) August 26, 2023
✅ No.1 Ranking
Pakistan get a huge boost ahead of #CWC23 💪https://t.co/ZTPebG5f2I