ICC Lates Odi Rankings Kohli : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. వన్డే ప్రపంచ కప్ -2023లో ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన అతడు.. మూడు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇంకా ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లలో శతకాలతో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్, ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ మలన్ కూడా తమ స్థానాలు మెరుగుపరుచు కోవడం విశేషం.
ఇదే ర్యాంకింగ్స్‌లో వన్డే వరల్డ్ నెం.1 బ్యాటర్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. టీమ్ ఇండియా యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ కూడా రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. అలాగే దక్షిణాఫ్రికా బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్, ఐర్లాండ్ స్టార్ హ్యారీ టెక్టార్, ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టాప్-5లో కొనసాగుతున్నారు. శ్రీలంకతో మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ సెంచరీ బాదగా.. కోహ్లీ ఆసీస్‌పై 85 పరుగులు చేశాడు. వీరిద్దరు వరుసగా 6, 7 స్థానాల్లో నిలిచారు. ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విధ్వంసకర శతకం(140) బాది.. ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు.
Kl Rahul Latest ODI Rankings : ఇకపోతే టీమ్ ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ 15 స్థానాలు మెరుగుపరచుకుని.. 19వ ర్యాంకుకు చేరుకున్నాడు. సొంతగడ్డపై ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కేవలం మూడు పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. అలాగే గిల్ కూడా అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమై నెంబర్.1గా అవతరించే ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు. ఇక కోహ్లీ - కేెఎల్ రాహుల్ ర్యాంకింగ్స్ విషయం తెలుసుకుంటున్న క్రికెట్ అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు.
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5 బ్యాటర్స్..
1. బాబర్ ఆజం(పాకిస్థాన్)
2. శుబ్‌మన్ గిల్(భారత్)
3. రాసీ వాన్ డెర్ డసెన్(సౌతాఫ్రికా)
4. హ్యారీ టెక్టర్(ఐర్లాండ్)
5. డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా).
-
Two-time World Cup winner Ricky Ponting discusses whether India great Virat Kohli will break Sachin Tendulkar's record for most ODI centuries at #CWC23 👀https://t.co/aJvi26kqjB
— ICC (@ICC) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Two-time World Cup winner Ricky Ponting discusses whether India great Virat Kohli will break Sachin Tendulkar's record for most ODI centuries at #CWC23 👀https://t.co/aJvi26kqjB
— ICC (@ICC) October 10, 2023Two-time World Cup winner Ricky Ponting discusses whether India great Virat Kohli will break Sachin Tendulkar's record for most ODI centuries at #CWC23 👀https://t.co/aJvi26kqjB
— ICC (@ICC) October 10, 2023
Ind vs Aus World Cup 2023 : కోహ్లీ-కేఎల్ రాహుల్ సూపర్ షో.. ప్రపంచకప్‌లో టీమ్ఇండియా శుభారంభం