ETV Bharat / sports

36 బంతుల్లో సెంచరీ.. పాక్​ సూపర్​ లీగ్​లో చెలరేగిన ఉస్మాన్​ ఖాన్​!

పాకిస్థాన్​ సూపర్​ లీగ్​లో వరుస రికార్డులు నమోదవుతున్నాయి. పాక్​కు చెందిన ఓ ప్లేయర్​ మ్యాచ్​లో విధ్వంసం సృష్టించాడు. తన ఆట తీరుతో సోషల్​ మీడియాలో ట్రెండ్​ అవుతున్నాడు. ఏమైందంటే?

usman khan pak cricketer
usman khan pak cricketer
author img

By

Published : Mar 12, 2023, 8:06 AM IST

Updated : Mar 12, 2023, 9:48 AM IST

ఇప్పటికే పలు రికార్డులకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తున్న పాకిస్థాన్ సూపర్ లీగ్​లో మరో సంచలనాన్ని సృష్టించాడు పాక్​ క్రికెటర్​ ఉస్మాన్ ఖాన్. క్వెట్టా గ్లాడియేటర్స్‌ టీమ్​తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్​కు చెందిన ఓపెనర్ ఉస్మాన్ ఖాన్.. కేవలం 36 బంతుల్లోనే శతాకాన్ని సాధించాడు. వీరవిధ్వంసం సృష్టించి సెంచరీ బాదేశాడు. ఇక ఇతని ఆటతీరు చూసి స్టేడియంలోని అభిమానులు షాక్​కు గురయ్యారు.

ఈ క్రమంలో ​ముల్తాన్స్ జట్టు బ్యాటర్ అయిన రిలీ రోసో 41 బంతుల్లో కొట్టిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో ఇప్పుడు ఉస్మాన్​ ఫాస్టెస్ట్​ సెంచరీ ఘనత నెట్టింట మారుమోగిపోతోంది. 43 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్లతో 120 రన్స్​ స్కోర్​ చేసిన ఉస్మాన్.. మహ్మద్ నవాజ్ బౌలింగ్​లో పెవీలియన్​ బాట పట్టాడు.

ఇక మ్యాచ్​లో ఆడిన మిగతా ప్లేయర్స్​లో మహ్మద్ రిజ్వాన్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు స్కోర్​ చేశాడు. టిమ్ డేవిడ్ 25 బంతుల్లో 43 పరుగులు సాధించగా పొలార్డ్‌ 23 పరుగులతో రాణించాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలోనే ముల్తాన్ సుల్తాన్ టీమ్​.. 3 వికెట్లు కోల్పోయి 262 పరుగుల భారీ స్కోర్​ను సాధించింది. కాగా ఉస్మాన్ బాదిన సెంచరీ పాకిస్థాన్​ సూపర్​ లీగ్​లో ఏడోది కావడం విశేషం. ఇప్పటికే మార్టిన్ గప్తిల్, మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, జాసన్ రాయ్, ఫకార్ జమాన్, రిలే రిసో శతాకాలు బాది రికార్డుకెక్కగా ఇప్పుడు వీరి జాబితాలో ఉస్మాన్​ ఖాన్​ చేరాడు.

అత్యధిక స్కోర్​ చేసిన జట్టు..
నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్‌ సుల్తాన్స్‌ టీమ్​ కేవలం 3 వికెట్లు కోల్పోయి.. 262 పరుగుల స్కోర్​ను నమోదు చేసింది. అలా పీఎస్‌ఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులు సృష్టించింది. అయితే క్వెటా గ్లాడియేటర్స్‌కు మాత్రం మొదట్లోనే చేదు అనుభవం ఎదరయ్యింది. ఓపెనర్​గా దిగిన జేసన్‌ రాయ్‌ 6 పరుగులకే పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో ఈ టీమ్​కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. ఇక మరో ఓపెనర్​ మార్టిన్‌ గప్టిల్‌ 37, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒమైర్‌ యూసఫ్‌ 67 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా మరో ప్లేయర్​ ఇఫ్తికర్‌ అహ్మద్‌ అర్ధ శతకం(53)తో రాణించినప్పటికీ.. గ్లాడియేటర్స్​కు ఓటమి తప్పలేదు.

Last Updated : Mar 12, 2023, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.