ETV Bharat / sports

WI vs IND: విండీస్​తో టెస్టు పోరుకు భారత్​ రె'ఢీ'.. 21 ఏళ్ల జైత్రయాత్రను కొనసాగిస్తుందా? - వెస్టిండీస్​ వర్సెస్​ టీమ్​ఇండియా 1983

India vs West Indies Test : గత నెల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​లో 209 భారీ పరుగుల తేడాతో ఓడిన భారత్​.. సరిగ్గా నెల తర్వాత మైదానంలో అడుగు పెట్టనుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే విండీస్​ టూర్​లో ఎలాగైనా గెలిచి తమ 21 ఏళ్ల జైత్రయాత్రను కొనసాగించాలని ఉవ్వీళూరుతుంది రోహిత్​ సేన. ఈ నేపథ్యంలో బుధవారం (జులై 12) సాయంత్రం 7:30కి విండీస్​-భారత్​ పోరుకు తెరలేవనుంది.

Test Records Between West Indies VS India
విండీస్​తో టెస్టు పోరుకు భారత్​ రెడీ.. 21 ఏళ్ల జైత్రయాత్రను కొనసాగిస్తుందా..?
author img

By

Published : Jul 12, 2023, 4:23 PM IST

Updated : Jul 12, 2023, 4:39 PM IST

India vs West Indies Test : మరికొద్ది గంటల్లో విండీస్​-భారత్​ మహా పోరుకు తెరలేవనుంది. బుధవారం (జులై 12) సాయంత్రం 7:30కి డొమినికా వేదికగా మొదటి టెస్టు ప్రారంభం కానుంది. చివరి సారిగా 2019లో విండీస్‌ పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియా.. దాదాపు నాలుగేళ్ల తర్వాత వెస్టిండీస్​తో​ టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. గతేడాది భారత్‌కు విండీస్‌ వచ్చినప్పటికీ టెస్టు సిరీస్​ మాత్రం ఆడలేదు. అయితే ఈ సారి రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్‌ఇండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

భారత్​ పైచేయి..
India vs West Indies Test Series History : గత 21 ఏళ్లుగా ఇరు దేశాల జట్ల మధ్య మొత్తం ఎనిమిది సిరీస్‌లు జరిగాయి. వీటన్నింటిలో టీమ్‌ఇండియానే విజయం సాధించడం విశేషం. చివరిసారిగా భారత్‌పై వెస్టిండీస్‌ 2001/2002 సీజన్‌లో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఒక్కసారి కూడా విండీస్​ భారత్​పై పైచేయి సాధించలేకపోయింది.

India vs West Indies All Match Result : ఇక ఇప్పటివరకు ఇరు జట్లూ కలిపి మొత్తం 98 టెస్టు మ్యాచులాడాయి. వీటిల్లో భారత్ (22), విండీస్‌ (30) విజయాలతో ఆధిపత్యంలో ఉంది. కరేబియన్‌ మైదానంలో 51 మ్యాచుల్లో తలపడగా.. విండీస్‌ 16 విజయాలు, భారత్ 9 విజయాలను నమోదు చేసింది. మరో 26 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. సిరీస్‌ల గణంకాల ప్రకారం.. విండీస్‌-భారత్‌ జట్ల మధ్య 24 టెస్ట్​ సిరీస్‌లు జరిగాయి. ఇందులో 12 సిరీస్‌లను వెస్టిండీస్‌ సొంతం చేసుకోగా.. భారత్ 10 సిరీస్‌లను గెలుచుకుంది. మరో రెండు మ్యాచ్​లు డ్రాగా ముగిశాయి.

2000వ సంవత్సరం ముందు వరకు విండీస్‌ క్రికెట్​ జట్టు సత్తా, ఆధిపత్యం ప్రపంచానికి తెలుసు. ఆ సమయంలో ఆ జట్టుపై విజయం సాధించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయినప్పటికీ భారత్‌ రెండుసార్లు సిరీస్‌ను దక్కించుకుంది. అయితే 2002-2003 సీజన్‌ నుంచి విండీస్‌తో ఆడిన అన్ని సిరీస్‌లను భారత్‌ క్లీన్​ స్వీప్​ చేస్తూ వస్తుంది.

భారత్​ పాంచ్​ పటాకా..

  • ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో వేదికగా 2016లో జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. అది కూడా వర్షం పడటంతో మ్యాచ్‌ ఫలితం డ్రాకు దారితీసింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-0 తేడాతో సొంతం చేసుకుంది.
  • 2018లో హైదరాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విండీస్‌పై 10 వికెట్ల తేడాతో గ్రాండ్​ విక్టరీ నమోదు చేసింది.
  • 2018లో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ విజయం భారత్‌నే వరించింది. విండీస్‌పై ఏకంగా ఇన్నింగ్స్‌ 272 పరుగుల భారీ స్కోర్​ తేడాతో గెలుపొందడం విశేషం.
  • 2019లో భారత్-వెస్టిండీస్​ మధ్య జమైకా వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 257 పరుగుల తేడాతో గెలిచింది.
  • 2019లో అంటిగ్వా మైదానంలో జరిగిన మ్యాచ్‌లోనూ విండీస్‌పై భారత్‌ 318 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన బ్యాటర్లు..

పేరు మ్యాచులుఇన్నింగ్స్ పరుగులు
సునీల్​ గావస్కర్​ 27 48 2749
క్లైవ్‌లాయిడ్(విండీస్​) 28 44 2344
శివ్‌నారాయణ్‌ చంద్రపాల్(విండీస్​) 25 44 2171
రాహుల్‌ ద్రవిడ్‌ 23 38 1978
వివియన్‌ రిచర్డ్స్‌(విండీస్) 28 41 1927

అత్యధిక వికెట్ల వీరులు..

ప్లేయర్​ మ్యాచులు వికెట్లు
కపిల్‌ దేవ్ 25 89
మాల్కమ్ మార్షల్‌ (విండీస్​) 17 76
అనిల్‌ కుంబ్లే 17 74
ఎస్‌ వెంకట రాఘవన్​ 23 68
ఆండీ రాబర్ట్స్‌ (విండీస్​) 14 67

Last Updated : Jul 12, 2023, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.