ETV Bharat / sports

పొట్టి ప్రపంచకప్​లో టీమ్ఇండియా జట్టు ఇదేనా! - శిఖర్​ ధావన్

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే టీ20 ప్రపంచకప్​కు ఇంకా ఎంతో సమయం లేదు. టీమ్​ ఇండియా జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాలా మంది పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన టీ20 స్వ్కాడ్​ను ప్రకటించారు ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే.

T20 World Cup
టీమ్ఇండియా
author img

By

Published : Aug 1, 2021, 11:01 AM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఇటీవలే ముగిసింది. ఫైనల్లో భారత్​ను ఓడించి.. ఛాంపియన్​గా నిలిచింది న్యూజిలాండ్​. మరికొద్దిరోజుల్లో అంతర్జాతీయ క్రికెట్​లో మరో సంగ్రామానికి తెరలేవనుంది. అభిమానులను అలరించబోయే భారీ ఈవెంట్ 2021 టీ20 ప్రపంచకప్​.

ఈ పొట్టి ప్రపంచకప్​ కోసం.. అన్ని జట్లూ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తమ తమ జట్లను ఖరారు చేసుకొనే పనిలో పడ్డాయి. అయితే.. భారత తుది జట్టులో ఎవరెవరు ఉంటారు.. ఎవరిపై వేటు పడుతుందనేది చర్చనీయాంశంగా మారింది. కారణం.. పోటీ విపరీతంగా ఉండటమే. అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ రాణిస్తుండటం సెలక్టర్లకు తలనొప్పిగా మారింది.

ఇటీవల శ్రీలంకతో వన్డే, టీ-20 సిరీస్​లోనూ కుర్రాళ్లు రాణించారు.

టీ20 వరల్డ్​కప్​కు మరో 2 నెలలే మిగిలి ఉన్న నేపథ్యంలో.. టోర్నమెంట్​లో తన ఇండియా స్వ్కాడ్​ను ప్రకటించారు ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే.

ధావన్ ఔట్..

ప్రధాన బ్యాట్స్​మెన్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్​ను ఎంపిక చేసిన భోగ్లే.. ఐదో స్థానానికి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్​ మధ్య పోటీ ఉంటుందని తెలిపాడు. శ్రీలంక పర్యటనలో రాణించిన.. శిఖర్​ ధావన్​కు చోటు కల్పించలేదు.

హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలను ఆల్​రౌండర్లుగా తీసుకున్నాడు భోగ్లే. వికెట్​కీపర్​గా రిషభ్ పంత్​ను ఖరారు చేశాడు.

కుల్దీప్ కష్టమే!

స్పెషలిస్టు స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, యుజ్వేంద్ర చాహల్​ను తీసుకున్న భోగ్లే.. లైనప్​లో మరో నలుగురు పేసర్లకు అవకాశం కల్పించాడు. తన జట్టులో ఫాస్ట్​ బౌలర్లుగా భువనేశ్వర్​ కుమార్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు కల్పించాడు. నాలుగో స్థానం కోసం మహ్మద్ షమీ, టి.నటరాజన్​లలో ఒకరు ఎంపికవుతారని అన్నాడు. ఇక చైనామన్​ స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​ను భోగ్లే పక్కనపెట్టేశాడు.

ఇదీ హర్ష భోగ్లే టీమ్​ఇండియా టీ20 జట్టు:

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్​), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్/ఇషాన్ కిషన్, రిషభ్ పంత్(వికెట్​ కీపర్​), హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ/టి.నటరాజన్.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​లో కోహ్లీ అండ్​ బాయ్స్​.. జాలీ జాలీగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.