Harmanpreet Kaur Feels No Regret : టీమ్ఇండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. బంగ్లాదేశ్ పర్యటనలో తన ప్రవర్తన కారణంగా రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న 100 బాల్ మహిళల టోర్నీలో ట్రెంట్ రాకెట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది హర్మన్. ఈ క్రమంలో శనివారం ట్రెంట్ రాకెట్స్, బర్మింగమ్ ఫినిక్స్‌తో తలపడింది. కాగా మ్యాచ్ అనంతరం ప్రెస్మీట్లో వివాదం గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా బదులిచ్చింది.
బంగ్లాదేశ్ పర్యటనలో చివరి వన్డే మ్యాచ్‌లో ఆ విషయంలో పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేదని హర్మన్ చెప్పింది. "జరిగిన దానికి నేను పశ్చాత్తాపం చెందడం లేదు. ఎందుకంటే ఏ ప్లేయరైనా గ్రౌండ్లో సరైన నిర్ణయాలనే చూడాలనుకుంటారు. అంతేకాకుండా సొంత ఫీలింగ్స్‌ను వ్యక్తపరిచేందుకు ప్రతి ప్లేయర్‌కు హక్కు ఉంటుంది. అలాగే నేను ఏ క్రీడాకారిణితోనూ, ఏ వ్యక్తితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. కేవలం మైదానంలో జరిగిందే చెప్పాను అంతే. దానికి నేను చింతించను" అని హర్మన్ తెలిపింది.
ఇదీ వివాదం.. గతనెల బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత్.. ఆతిథ్య జట్టుతో వన్డే సిరీస్ ఆడింది. ఈ క్రమంలో మూడో మ్యాచ్‌లో 33.4 ఓవర్ వద్ద హర్మన్.. బంగ్లా బౌలర్ నహిద అక్తర్ వేసిన టాస్ బంతిని స్వీప్ చేయబోయింది. బంతి బ్యాట్ అంచున ముద్దాడి.. ఆమె లెగ్ ప్యాడ్స్‌కు తగిలింది. దీంతో బంగ్లా బౌలర్లు అప్పీల్ చేయకముందే.. ఫీల్డ్ అంపైర్ హర్మన్‌ను ఔట్‌గా ప్రకటించారు.
అంతే తాను ఔట్ కాదంటూ.. హర్మన్ పట్టరాని కోపంతో స్టంప్స్‌ను బలంగా కొట్టి, అంపైర్ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేసింది. అక్కడితో ఆగకుండా మ్యాచ్ ప్రజెంటేషన్ సమయంలో అంపైర్లను ఉద్దేశించి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది హర్మన్.
కాగా ఆమె క్రమశిక్షణ నిబంధనలు ఉల్లఘించినట్లు మ్యాచ్ రిఫరీ భావించాడు. దీంతో హర్మన్‌కు 75 శాతం మ్యాచ్ ఫీజులో కోతతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు విధించారు. రూల్స్ ప్రకారం ఏ ప్లేయరైనా మూడు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు పొందితే.. రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమవుతారు. ఈ క్రమంలో హర్మన్ సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడల్లో తొలి రెండు మ్యాచ్‌లు బెంచ్‌కు పరిమితమం కానుంది.
కోపంతో ఊగిపోయిన హర్మన్ ప్రీత్ కౌర్.. అవమానించారంటూ..
హర్మన్ బ్యాన్పై అప్పీల్! కెప్టెన్ నుంచి వివరణ కోరనున్న బీసీసీఐ!