ETV Bharat / sports

'అలా చేస్తేనే హార్దిక్​కు జట్టులో చోటు కల్పించండి' - గంభీర్ న్యూస్ టుడే

టీ20 ప్రపంచకప్​లో భాగంగా​ వార్మప్​ మ్యాచ్​ల్లో(T20 World Cup Warm-up Matches) టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్​ పాండ్య మెరుగైన బౌలింగ్ ప్రదర్శన చేయాలని గౌతమ్​ గంభీర్ సూచించాడు. అలా చేస్తేనే అతడికి(Hardik Pandya News) జట్టులో చోటు కల్పించాలని అభిప్రాయపడ్డాడు.

gambhir
గంభీర్
author img

By

Published : Oct 17, 2021, 7:41 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా​ వార్మప్​ మ్యాచ్​ల(T20 World Cup Warm-up Matches)ముందు టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ బ్యాట్స్​మన్ గౌతమ్ గంభీర్. పాండ్య(Hardik Pandya News) బౌలింగ్​ తీరు మెరుగుపరుచుకుంటేనే అతడికి ప్రపంచకప్​ మ్యాచ్​ల్లో(T20 World Cup 2021) చోటు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

"నెట్స్​లో కాకుండా వార్మప్​ మ్యాచ్​ల్లోనూ హార్దిక్​ మెరుగైన బౌలింగ్​ చేయాలి. అలా చేస్తేనే అతడికి ప్రపంచకప్​ మ్యాచ్​ల్లో 11మందితో కూడిన తుది జట్టులో చోటు కల్పించాలి. నెట్స్​లో బౌలింగ్​ చేయడానికి అసలు పోరులో ఆడటానికి చాలా తేడా ఉంటుంది. ప్రపంచకప్​లో బాబర్​ ఆజామ్​ వంటి మేటి బ్యాట్స్​మన్​కు బంతులు విసరడం అంటే అంత సులవైన విషయం కాదు."

--గౌతమ్ గంభీర్, మాజీ ఆటగాడు.

2019లో సర్జరీ అనంతరం హార్దిక్​ పాండ్య.. ఐపీఎల్​లోగాని, జట్టులోగాని రెగ్యులర్​గా బౌలింగ్​తో అదరగొట్టిన సందర్భాలు చాలా తక్కువ. ఈ ఐపీఎల్​ సీజన్​లోనూ ఫిట్​నెస్​ సమస్యల కారణంగా అతడు​ పలు మ్యాచ్​లకు దూరమయ్యాడు. అయితే.. అతడిని బ్యాటింగ్​ ఆల్​రౌండర్​గా ఎంపిక చేసినట్లు సెలక్టర్లు చెబుతున్నారు. మరోవైపు అక్షర్​ పటేల్​ స్థానంలో ఆల్​రౌండర్​గా అదరగొడుతున్న శార్దూల్​ ఠాకూర్​కు జట్టులో చోటు లభించడం గమనార్హం.

ఇదీ చదవండి:

'టీ20 ప్రపంచకప్​లో ఫినిషర్​గా హార్దిక్..'

T20 World Cup 2021: 'విరాట్​ కోహ్లీ కోసం కప్​ గెలవండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.