టీమ్ఇండియా ఆల్‌రౌండర్, టీ 20ఫార్మాట్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. హార్దిక్‌తో పాటు అతడి సోదరుడు కృనాల్ పాండ్య కూడా ఉన్నాడు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను హార్దిక్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమను ఆహ్వానించినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ సమావేశానికి గల కారణాన్ని వెల్లడించలేదు.
హార్దిక్ పాండ్య శ్రీలంకతో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమ్ఇండియాకు సారథ్యం వహించనున్నాడు. కాగా, శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. గాయం నుంచి బయటపడ్డ తర్వాత 2022 మొదట్లో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు ఈ ప్లేయర్. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కాగా, ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహించాడు. ఆ సమయంలోనే కెప్టెన్‌గా జట్టును సమర్థంగా నడిపించి.. మొదటి ప్రయత్నంలోనే కప్పును అందుకున్నాడు. అప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడు కెప్టెన్‌గా టీమ్‌ను సమర్థంగా నడిపించాడు. అయితే అంతకుముందు కూడా ఐర్లాండ్, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీసుల్లో టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాగా, హార్దిక్ పాండ్య ప్రదర్శనపై మాజీ టీమ్ఇండియా ఆడగాడు సంజయ్ మంజ్రేకర్ స్పందించారు. హార్దిక్.. కెప్టెన్‌గా ఐపీఎల్లో సక్సెస్ అవుతాడని చాలా మంది నమ్మలేదని చెప్పారు.