టీ20 ప్రపంచకప్ ఫైనల్లో(t20 world cup 2021 final) న్యూజిలాండ్.. తన ఫేవరెట్ జట్టని తెలిపారు బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ(Ganguly News). '40వ షార్జా ఇంటర్నేషన్ బుక్ ఫెయిర్' కార్యక్రమంలో పాల్గొన్న దాదా.. టీ20 వరల్డ్‌కప్ 2020లో భారత్ ప్రదర్శన, టీమ్ఇండియా కోచ్‌గా ద్రవిడ్ ఎంపిక, భారత్- పాక్ ద్వైపాక్షిక సిరీస్‌తో పాటు పలు అంశాలపై మాట్లాడారు.
ఇది న్యూజిలాండ్ టైం..
"ప్రపంచ క్రికెట్లో ఇప్పుడు న్యూజిలాండ్ సమయం నడుస్తోందని నేను భావిస్తున్నా. ఆస్ట్రేలియా ఓ విధ్వంసకర జట్టు. కానీ ప్రస్తుతం దానికి గడ్డుపరిస్థితులే ఉన్నాయి. న్యూజిలాండ్‌కే అధిక సామర్థ్యం ఉంది. ఇటీవలే ఆ జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ గెల్చుకుంది. అది చిన్నదేశమైనా.. శక్తి ఎక్కువ. ఇది న్యూజిలాండ్ సమయం అని నేను భావిస్తున్నా." అని దాదా వివరించారు.
భవిష్యత్తులో మరిన్ని రికార్డులు..
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు(Sourav Ganguly on Team India) సాధించిన రికార్డులపైనా గంగూలీ స్పందించారు.
"కోహ్లీ సారథ్యంలో భారత్ అత్యద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆస్ట్రేలియాను సొంతగడ్డపైనే చిత్తుచేసింది. తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ కొవిడ్-19 కారణంగా అది వాయిదా పడింది. రానున్న రోజుల్లో టీమ్ఇండియా నుంచి మరిన్ని రికార్డులు ఆశించవచ్చు" అన్నారు దాదా.
టీ20 వరల్డ్‌కప్‌లో(T20 World Cup 2021) భారత్‌పై పాకిస్థాన్ జట్టు 10వికెట్ల తేడాతో గెలుపొందడంపై దాదా కీలక వ్యాఖ్యలు చేశారు.
వాళ్లూ మానవమాత్రులే కదా..
"ఈ మ్యాచ్‌పై అందరికీ అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. మెజారిటీ అభిమానులు ఫలితాన్ని అంగీకరించారు. దానికి చాలా సంతోషం. కొంతమంది టీమ్ఇండియా జట్టుపై(Sourav Ganguly on Team India) అనుచిత వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. మహ్మద్ షమీ, బుమ్రా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అందరూ మానవమాత్రులే కదా. టీమ్ఇండియా ఆటగాళ్లు మళ్లీ ట్రోఫీలు గెలవడం త్వరలోనే చూస్తాం" అని తన అభిప్రాయాన్ని తెలిపారు గంగూలీ.
ద్రవిడ్ కుమారుడి అభ్యర్థన మేరకే(నవ్వుతూ)..
'రాహుల్ ద్రవిడ్‌ను టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా నియమించటంలో మీ పాత్ర ఉందా?' అన్న ప్రశ్నకు సరదాగా నవ్వుతూ సమాధానమిచ్చారు దాదా. ద్రవిడ్(Rahul dravid coach) కుమారుడు చేసిన అభ్యర్థన మేరకే అలా చేశానని చెప్పారు. "ద్రవిడ్ కుమారుడు ఓ సారి ఫోన్ చేసి.. 'మా నాన్న నాపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అతన్ని ఎటైనా తీసుకెళ్లండి' అని చెప్పాడు. అందుకే హెడ్ కోచ్‌గా చేశాం" అని నవ్వుతూ సమాధానమిచ్చారు గంగూలీ.
"ద్రవిడ్, నేను కలిసి కెరీర్‌ను ప్రారంభించాం. ఎన్నో మ్యాచ్‌లు కలిసే ఆడాం. అందుకే హెడ్ కోచ్‌గా ద్రవిడ్ నియామకాన్ని నేను స్వాగతిస్తున్నా. ఇప్పుడు జట్టుకు ఆయన అవసరం ఉంది. ద్రవిడ్ ఓ 'అత్యద్భుత అంబాసిడర్'. క్రికెట్‌ను సరైన స్ఫూర్తితో ఆడాడు" అన్నారు దాదా.
టెస్టు క్రికెట్ బెటర్..
ప్రస్తుత టీ20, ఫ్రాంచైజీ క్రికెట్‌పై గంగూలీ స్పందించారు. 'నేను క్రికెట్ ప్రారంభించినప్పుడు 220 పరుగులు చేస్తే మ్యాచ్ గెలిచేస్తాం అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు 350 పరుగులు చేసినా కష్టమే. దీన్నిబట్టి క్రికెట్ ఎలా మారిందో చూడొచ్చు. నేను 2008-2012 వరకు టీ20లు ఆడాను. కానీ టెస్టు క్రికెట్ బెటర్' అని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అది బోర్డుల చేతిలో లేదు..
భారత్- పాక్(ind pak match) మధ్య ద్వైపాక్షిక క్రికెట్ పాక్ బోర్టు లేదా బీసీసీఐ చేతిలో లేదని గంగూలీ తెలిపారు. ఇరు జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు కొన్నేళ్లుగా జరగటం లేదన్నారు. దీనిపై ఇరు దేశాల ప్రభుత్వాలు స్పందించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి: AUS vs NZ Final: 'ఆ జట్టే ఫేవరెట్.. ఎందుకంటే?'