Captains With Highest Trophies :ఓ జట్టు సారథిగా ఉండటం అంటే అది మామూలు విషయం కాదు. అటు టీమ్‌కు ఇటు మేనేజ్మెంట్కు మధ్య వారధిలా ఉండే ఈ కెప్టెన్.. తనుకన్న బాధ్యతలను నిర్వర్తిస్తూనే జట్టును విజయపథంలో నడిపిస్తుంటాడు. అలా అత్యుత్తమైన నాయకత్వ లక్షణాలతో ఉన్న స్టార్ క్రికెటర్లు ఎందరినో మనం చూసుంటాం. ఫార్మాట్ ఏదైనా సరే.. తమ వ్యూహాలతో టీమ్‌లో కీలక పాత్ర పోషిస్తుంటారు. జట్టు సభ్యులను ఉత్సాహపరచడంలోనూ వారి పాత్ర ఎంతో ఉంటుంది. లీగ్ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు తమ జట్టును విజయ పథంలో నడిపించి ట్రోఫీలు అందించిన సారథులు ఎందరో ఉన్నారు. అలా ఇప్పటి వరకు క్రికెట్‌లో ఎక్కువ ట్రోఫీలు సాధించిన కెప్టెన్ల గురించి ఓ సారి చూసేద్దాం..
Ms Dhoni Trophies List : క్రికెట్ హిస్టరీలో అత్యధిక ట్రోఫీలను ముద్దాడిన కెప్టెన్లలో టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అందరి చేత మిస్టర్ కూల్ అనిపించుకునే ఈ స్టార్ ప్లేయర్.. తన నాయకత్వపు లక్షణాలతో జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించాడు.
2007లో తొలిసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు జట్టుకు ఓ టీ20 ప్రపంచకప్‌ను అందించాడు . ఆ తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్ అందుకుని ధోని సేన ఓ నయా చరిత్రను సృష్టించింది. ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ధోనీ సారథ్యంలోనే వచ్చింది.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు.. ఐపీఎల్‌లోనూ ధోనీ అదే జోరును కొనసాగించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ పలు ట్రోఫీలను ముద్దాడాడు. ఇటీవలే జరిగిన 16వ సీజన్లోనూ ధోనీ సారథ్యం వహించిన చెన్నై టీమ్.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. అలా కెప్టెన్‌గా మొత్తం పది టైటిళ్లు సాధించిన ధోనీ.. ఈ జాబితాలో అగ్రస్థానం ఉన్నాడు.
![dhoni with world cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-08-2023/19164117_crikcet-trophies-7.jpg)
Rohit Sharma Trophies List : ఇక టీమ్ఇండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అనేక మార్లు జట్టులో కీలక పాత్ర పోషించాడు. తన సారథ్య బాధ్యతలను భుజాన మోస్తూ వచ్చిన హిట్ మ్యాన్ ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తనదైన స్టైల్లో విజృంభిస్తూ విజయవంతమైన సారథిగా కొనసాగుతున్నాడు. ముంబయి ఇండియన్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న రోహిత్.. జట్టుకు ఐదు ట్రోఫీలు అందించి ఓ అరుదైన రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. 2015, 2017, 2019, 2020లలో జట్టుకు ట్రోఫీలు అందించిన రోహిత్.. వీటితోపాటు 2013 ఛాంపియన్స్ లీగ్‌లోనూ జట్టును విజేతగా నిలిపాడు.
![Rohit sharma with ipl trophy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-08-2023/19164117_crikcet-trophies-3.jpg)
Ricky Ponting Trophies List : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా జట్టు సారథిగా ఉంటూ ఎన్నో రికార్డులు సృష్టించాడు. బ్యాటింగ్‌తో పాటు అత్యద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ కలిగిన పాంటింగ్.. 2003, 2007లో దేశానికి వరుసగా రెండు ప్రపంచ కప్‌లు తెచ్చిపెట్టాడు. 2003 ప్రపంచ కప్ ఫైనల్స్‌లో భారత జట్టును 135 పరుగుల తేడాతో మట్టికరిపించి ప్రపంచ కప్‌ను ముద్దాడాడు. 2007లో వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో మరోమారు జట్టును విజేతగా నిలిపాడు. అంతే కాకుండా కాకుండా 2006, 2009లో కంగారూ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందేలా చేశాడు.
![ricky ponting with world cup trophy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-08-2023/19164117_crikcet-trophies-4.jpg)
Dwayne Bravo Trophies List : క్రికెట్ హిస్టరీలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న విజయవంతమైన కెప్టెన్లలో కరీబియన్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఒకడు. 2004 నుంచి దాదాపు 17 ఏళ్ల పాటు వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ స్టార్ ప్లేయర్.. తన సుదీర్ఘ కెరీర్‌లో జట్టుకు ఎన్నో కప్పులను తెచ్చిపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ లాంటి ఫార్మాట్లోనూ సత్తా చాటాడు. కెప్టెన్‌గా నాలుగు సీపీఎల్ ట్రోఫీలు అందుకున్నాడు. 2015-2018 మధ్య జరిగిన సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు మూడు ట్రోఫీలు అందించిన బ్రావో.. 2021లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్‌కు తొలి టైటిల్‌ను అందించాడు.
Clive Lloyd Trophies List : విండీస్ జట్టు మాజీ సారథి క్లైవ్ లాయిడ్ కూడా తన జట్టుకు ఎన్నో ట్రోఫీలకు అందించాడు. 1974-1985 మధ్య కరీబియన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయన తన సారథ్యంతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించేవాడు. అందుకే 1975లో జరిగిన తొలి వన్డే ప్రపంచ కప్‌లో విండీస్ సేన ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్‌గా చరిత్రకెక్కింది. ఆ తర్వాత 1979లోనూ మరోమారు విండీస్ జట్టు ప్రపంచ కప్‌ను ముద్దాడింది. దాంతో, ప్రపంచ కప్‌ను వరుసగా రెండుసార్లు అందుకున్న కెప్టెన్‌గా క్లైవ్ రికార్డుకెక్కాడు.
Gautham Gambhir Trophies List : తన సారథ్య లక్షణాలతో అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లో చెరగని ముద్ర వేసిన టీమ్ఇండియా ఆటగాళ్లలో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్.. 2012, 2014లో కోల్‌కతా జట్టుకు రెండు టైటిళ్లు అందించాడు.
![Gautham Gambhir With IPL Trophy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-08-2023/19164117_crikcet-trophies-1.jpg)
Moises Henriques Trophies List : ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్‌గా పేరొందిన మెయిసెస్ హెన్రిక్స్.. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో సిడ్నీ సిక్సర్స్ (సీసీ)కి ప్రాతినిధ్యం వహించిన సమయంలో జట్టును రెండుసార్లు విజేతగా నిలిపాడు.
![Moises Henriques with trophy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-08-2023/19164117_crikcet-trophies-2.jpg)