ETV Bharat / sports

భారత్-పాక్ పోరు.. ఈ వివాదాలు ఎప్పటికీ మర్చిపోలేరు! - అక్తర్​ హర్భజన్​

టీ20 ప్రపంచకప్​లో(T20 world cup 2021 schedule)భాగంగా అక్టోబర్​ 24న భారత్​-పాకిస్థాన్​ మధ్య మ్యాచ్​ జరగనుంది(pak india match 2021). అయితే ఇరు జట్ల మధ్య పోరు అంటే ఆషామాషీ కాదు. ఆటగాళ్ల దూకుడు ప్రదర్శన, కొట్లాట, కవ్వింపులు ఉంటాయి. గతంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లే ఇందుకు నిదర్శనం. ఓ సారి ఆ వివాదస్పద సంఘటనలను గుర్తుచేసుకుందాం..

t20
టీ20
author img

By

Published : Oct 22, 2021, 9:31 AM IST

క్రికెట్ మ్యాచ్​లు(T20 world cup 2021 schedule) జరిగేటప్పుడు ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య లేదా ప్లేయర్స్​-అంపైర్లకు మధ్య ఘర్షణలు జరగడం అప్పుడప్పుడు చూస్తుంటాం. కొంతమంది మధ్య మాటల యుద్ధం జరిగితే మరికొంతమంది కొట్టుకునే వరకు వెళ్లిపోతారు. వాటిలో కొన్ని సంఘటనలు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్​లో భాగంగా అక్టోబర్​ 24న టీమ్​ఇండియా-పాకిస్థాన్(pak india match 2021)​ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ ఇరు జట్ల మధ్య పోరు​ ​అంటే అభిమానులకు ఎనలేని ఆసక్తి. రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఆటగాళ్ల దూకుడు ప్రదర్శన, కవ్వింపు చర్యలతో రసవత్తరంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఈ రెండు జట్ల ఆటగాళ్ల​ మధ్య జరిగిన కొన్ని వివాదాస్పద సంఘటనలను గుర్తుచేసుకుందాం..

మియాందాద్​ కుప్పిగంతులు(miandad kiran more)

1992 ప్రపంచకప్​లో(1992 world cup pak vs india) భాగంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారత్-పాక్​ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో అప్పటి టీమ్​ఇండియా వికెట్​ కీపర్​ కిరణ్​ మోరె​ పాక్​ ఆటగాడు మియాందాద్ మధ్య మటల యుద్ధం జరిగి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేంత వరకు వెళ్లింది.

ఈ మ్యాచ్​లో భారత్​ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్​.. ఏ దశలోనూ నిలకడగా ఆడలేకపోయింది. మ్యాచ్​ మధ్యలో కీపర్ కిరణ్​ మోరె చేసిన ఔట్ అప్పీల్​కు మియాందాద్​ కోపంతో ఊగిపోయాడు. కుప్పిగంతులు వేస్తూ మోరెను హేళన చేశాడు. అయితే మోరె.. రెండు క్యాచ్​లు, ఓ రనౌట్​, ఓ స్టంపింగ్​తో భారత విజయంలో కీలకంగా మారితే.. మియాందాద్​ మాత్రం 110బంతుల్లో 40 పరుగులు చేసి తమ జట్టు ఓటమికి బాధ్యుడయ్యాడు. ఈ పోరులో సచిన్​ అజేయంగా 54 పరుగులు చేయడం సహా ఒక వికెట్​ తీశాడు.

cricket contoversy
మియాందాద్- కిరణ్​మోరె

సోహైల్​కు దీటుగా సమాధానం(venkatesh prasad aamir sohail) ​

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం 1996 ప్రపంచకప్​ క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​కు వేదిక. సెమీస్​ బెర్త్​ కోసం భారత్​, పాక్​ మైదానంలో బరిలో దిగాయి. ఈ మ్యాచ్​లో ఉన్నట్టుంది చిన్న అలజడి మొదలైంది. భారత్​ నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సోహైల్​ వరుస బౌండరీలతో వెంకటేశ్​ ప్రసాద్​ను రెచ్చగొట్టాడు. ఎక్స్​ట్రా కవర్స్​లో బంతిని కొట్టి 'మళ్లీ అక్కడికే కొడతా వెళ్లి తెచ్చుకో' అంటూ ఎగతాళి చేశాడు. దీంతో వెంకీ తర్వాతి బంతిని ఆఫ్​స్టంప్​ బయటకు వేశాడు. ఆ బాల్​ను ఆడబోయి సోహైల్​ క్లీన్​బౌల్డ్​ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా పట్టరాని ఆవేశంతో వెంకీతో మాటల యుద్ధానికి దిగాడు. అలా వారిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ మ్యాచ్​లో భారత్​ గెలిచింది.

cricket contoversy
సోహైల్​-వెంకటేశ్​

గంభీర్ -అఫ్రిది(gambhir afridi fight)

గంభీర్​, అఫ్రిది.. వీరిద్దరూ ఇప్పటికీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటారు. 2007లో(gautam gambhir 2007 world cup) కాన్పూర్​లో జరిగిన భారత్-పాకిస్థాన్​ మ్యాచ్​లోనూ వీరు గొడవ పడ్డారు. ఒకరి మీదకు మరొకరు దూసుకెళ్తూ కొట్టుకోబోయారు. వెంటనే సహచర ఆటగాళ్లు వాళ్లకు సర్దిచెప్పి వివాదం పెద్దది కాకుండా చూశారు. ఆ మ్యాచ్​లో ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించినందుకు వారిపై ఐసీసీ చర్యలు కూడా తీసుకుంది.

cricket contoversy
గంభీర్ -అఫ్రిది

గంభీర్​-కమ్రన్​(gautam gambhir kamran akmal)

2010 ఆసియా కప్​లో(ind vs pak asia cup 2010) భాగంగా గంభీర్, కమ్రన్​ మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. గౌతీ బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో వికెట్ల వెనుక ఉన్న అక్మల్​ అస్తమానం అప్పీల్​ చేస్తుండటం వల్ల సహనం కోల్పోయిన​ గంభీర్​ అతడికి వార్నింగ్​ ఇచ్చాడు. అక్మల్​ కూడా అతడిపై బాగా సీరియస్​ అయ్యాడు. ఒకానొక సందర్భంలో ఇద్దరూ కొట్టుకునేలా కనిపించారు. అయితే అంపైర్లు, ధోనీ కలుగజేసుకుని ఈ ఘర్షణను సద్దుమణిగేలా చేశారు. ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్​ విజయం సాధించింది.

cricket contoversy
గంభీర్​-కమ్రన్

అక్తర్​-హర్భజన్​(akhtar harbhajan)

ఇదే మ్యాచ్​లో(ind vs pak asia cup 2010) హర్భజన్​ సింగ్​, షోయబ్​ అక్తర్​ కూడా గొడవ పడ్డారు. పాక్​ నిర్దేశించిన 267 పరుగులు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి ఓవర్​లో భారత్​ ఏడు పరుగులు చేయాల్సి ఉంది. దీంతో అభిమానుల్లో, ప్లేయర్స్​లో ఉత్కంఠ నెలకొంది. క్రీజులో ఉన్న భజ్జీకి 19వ ఓవర్​ వేసిన అక్తర్​.. భారత్​ ఓటమి ఖాయం అనేలా రెచ్చిపోయాడు. అయితే భజ్జీ మాత్రం మహ్మద్​ అమీర్​ వేసిన చివరి ఓవర్​లో సిక్సులు కొట్టి గట్టి సమాధానమిచ్చాడు. దీంతో అక్తర్​ ముఖం తెల్లబోయింది.

cricket contoversy
అక్తర్​-హర్భజన్

ఇదీ చూడండి: T20 World Cup: భారత్-పాక్ పోరు.. టీమ్ఇండియాదే జోరు!

T20 world cup 2021: కోహ్లీ వర్సెస్​ బాబర్​.. రికార్డులివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.