ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్, వివాదాస్పద క్రికెటర్ టిమ్ పెయిన్ మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడు. 2017లో ఒక మహిళకు అసభ్యకర సందేశాలు పంపిన వివాదం వెలుగులోకి రావడంతో గత ఏడాది నవంబర్‌లో ఆసీస్ టెస్టు కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఆట నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్నాడు.
ఇప్పుడు తాజాగా తన దేశవాళీ జట్టు అయిన టాస్మేనియా టీమ్ ప్రాక్టీస్ సెషన్‌లో అతను కూడా పాల్గొన్నాడు. బుధవారం ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్‌లో టాస్మేనియా.. టాస్ ఓడింది. ప్రత్యర్థి జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది. అయితే పెయిన్.. ఫీల్డ్‌లోకి దిగి కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
టిమ్ పెయిన్ ఆసీస్ తరపున 35 టెస్టుల్లో 1534 పరుగులు, 35 వన్డేల్లో 890 పరుగులు, 12 టి20ల్లో 82 పరుగులు సాధించాడు.
ఇవీ చదవండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన క్రికెటర్ భార్య.. ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెబుతూ లెటర్!
ఆస్ట్రేలియాకు టీమ్ఇండియా.. టీ20 వరల్డ్‌కప్ వేటకు రెడీ.. బీసీసీఐ పోస్ట్ వైరల్!