ETV Bharat / sports

'టీమ్​ఇండియాను ఓడించడం ప్రతి జట్టు కల' - టీమ్​ఇండియాXఇంగ్లాండ్

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రితో తమకున్న బంధాన్ని వివరించాడు టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli). కోచ్​తో జట్టుకున్న దృఢమైన బంధం వల్లే టీమ్​ఇండియా మెరుగైన స్థానంలో ఉందని తెలిపాడు.

kohli
కోహ్లీ
author img

By

Published : Sep 2, 2021, 2:19 PM IST

భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రితో తమకున్న బంధం పరస్పర గౌరవం, నమ్మకంతో ఏర్పడిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అన్నాడు. ఈ బంధం వల్లే భారత జట్టు దృఢంగా ఉందని.. టీమ్​ఇండియాను ఓడించాలని ప్రతిఒక్కరూ కలలు కంటున్నారని తెలిపాడు. ఓవల్ వేదికగా జరగనున్న ఇంగ్లాండ్​, భారత్ మధ్య నాలుగో టెస్టు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు కోహ్లీ.

"రవిశాస్త్రితో ఏర్పడిన బంధం పరస్పర గౌరవంతో వచ్చింది. నమ్మకంతో ఏర్పడింది. మైదానం వెలుపల కూడా ఈ బంధం దృఢంగా ఉంటుంది. ఒకే లక్ష్యం, ఒకే దృష్టితో ఉండటం వల్లే భారత క్రికెట్​ జట్టును ఇంత మెరుగైన స్థానంలో ఉంచగలిగాం."

--విరాట్ కోహ్లీ, కెప్టెన్.

టీమ్​ఇండియాను ఎప్పుడూ మెరుగైన స్థానంలో ఉంచాలని ఆటగాళ్లు ఆశిస్తారని అన్నాడు కోహ్లీ. ప్రపంచంలో ఏ చోట ఆడినా.. ఇతర జట్లు టీమ్​ఇండియాపై నెగ్గాలని మిక్కిలి ఆశతో ఉంటాయని అన్నాడు.

గురువారం భారత్-ఇంగ్లాండ్ (INDvsENG) మధ్య నాలుగో టెస్టు(ind vs eng 4th test 2021) ప్రారంభంకానుంది. లండన్ ఓవల్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్​లో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది.

ఇదీ చదవండి:

INDvsENG 4th Test: గెలుపే లక్ష్యంగా రెండు జట్లు!

'అప్పుడే ఆట అయిపోలేదు.. ఇప్పటికైనా గెలుస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.