ETV Bharat / sports

IND Vs ENG: 'ఆఖరి టెస్టు రద్దు.. వారికి క్షమాపణలు చెబుతున్నా' - ECB

టీమ్ఇండియాతో ఐదో టెస్టు(India Vs England 5th Test) రద్దవ్వడంపై ఇంగ్లీష్ బౌలర్​​ అండర్సన్​ విచారం వ్యక్తం చేశాడు. అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. భవిష్యత్తులో ఈ మ్యాచ్​(James Anderson on 5th Test)నిర్వహిస్తారని అనుకుంటున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Gutted for fans that series didn't get finish deserved: Anderson
IND Vs ENG: ఆఖరి టెస్టు రద్దుపై ఆండర్సన్​ భావోద్వేగం
author img

By

Published : Sep 12, 2021, 10:03 PM IST

భారత్​, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్​ వేదికగా జరగాల్సిన ఆఖరి టెస్టు(IND Vs ENG) కరోనా కారణంగా రద్దైంది. టీమ్ఇండియా కోచ్​ల బృందంలో కరోనా కేసులు రావడం వల్ల మ్యాచ్​ రద్దు చేస్తున్నట్లు ఇరు దేశాల క్రికెట్​ బోర్డులు ప్రకటించాయి. అయితే ఈ టెస్టును కచ్చితంగా భవిష్యత్​లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తామని బోర్డులు వెల్లడించాయి. అయితే భారత్​తో చివరి టెస్టు రద్దవ్వడం పట్ల విచారం(James Anderson on 5th Test) వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్​ సీనియర్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్​. ఆ మ్యాచ్​ను ఆస్వాదించాలని చాలామంది అభిమానులు ఆశగా మాంచెస్టర్​ చేరుకున్నారని.. వారికి తన క్షమాపణలు తెలియజేస్తున్నాని ఇన్​స్టాగ్రామ్​లో పేర్కొన్నాడు.

"అంతర్జాతీయ క్రికెట్​లో ఇలా జరగడం చాలా సిగ్గుచేటు. టీమ్ఇండియాతో చివరి టెస్టు రద్దవ్వడం నాలో చాలా నిరాశకు కలిగించింది. ఈ మ్యాచ్​ను చూసేందుకు ఎంతోమంది క్రికెట్​ అభిమానులు మ్యాచ్​ టికెట్స్​, ట్రైన్​ టికెట్స్​, హోటల్స్​ బుక్ చేసుకున్నారు. కానీ, మ్యాచ్​ రద్దైన కారణంగా ప్రేక్షకులు మమ్మల్ని మన్నించాలి. ఈ మ్యాచ్​ను తిరిగి నిర్వహిస్తారని ఆశిస్తున్నా. దీంతో నేను నా స్వదేశంలో ఇష్టమైన మైదానంలో నేను మరో మ్యాచ్​ ఆడే అవకాశం దక్కుతుంది"

- జేమ్స్​ అండర్సన్​, ఇంగ్లాండ్​ పేసర్​

ఇంగ్లాండ్​ పర్యటనలో(India Vs England Test Series) భాగంగా జరగాల్సిన ఐదు టెస్టుల్లో నాలుగు పూర్తయ్యాయి. వాటిలో తొలి టెస్టు వర్షం కారణంగా రద్దువ్వగా.. మిగిలిన మూడు టెస్టుల్లో రెండింటిలో గెలిచిన కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే మాంచెస్టర్​ వేదికగా జరగాల్సిన సిరీస్​ నిర్ణయాత్మక మ్యాచ్​(Manchester Test) కరోనా కారణంగా రద్దైంది.

జేమ్స్​ అండర్సన్.. తన అంతర్జాతీయ టెస్టు కెరీర్​లో 166 మ్యాచ్​లు ఆడి, 632 వికెట్లు(James Anderson Test Wickets) పడగొట్టాడు. టీమ్ఇండియాతో జరిగిన ఈ సిరీస్​లో 15 వికెట్లు తీశాడు.

ఇదీ చూడండి.. IND Vs ENG: ఐదో టెస్టు రద్దుపై రవిశాస్త్రి స్పందన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.