ETV Bharat / sports

Josh Tongue Bet : నేషనల్ టీమ్​కు ఆడతాడని 11ఏళ్ల క్రికెటర్​పై బెట్టింగ్.. రూ.50లక్షలు జాక్​పాట్!

ఓ వ్యక్తి తన స్నేహితుడి కొడుకు విషయంలో జోస్యం పలకగా అది నిజమై.. అతనికి లక్షల జాక్​పాట్​ వచ్చింది. జాష్​ టంగ్‌ అనే ఇం‍గ్లండ్‌ పేసర్​ విషయంలో జరిగిన ఈ ఘటనతో ఆ వ్యక్తి ఏకంగా రూ.50 లక్షలు సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఎలా అంటే ?

author img

By

Published : Jun 2, 2023, 10:15 AM IST

Updated : Jun 2, 2023, 11:00 AM IST

josh tongue
josh tongue

Josh Tongue Bet : ఓ వ్యక్తి తన స్నేహితుడి కొడుకు విషయంలో జోస్యం పలకగా అది నిజమై.. అతనికి లక్షల రూపాయల జాక్​పాట్​ వచ్చింది. ఐర్లాండ్‌తో జూన్‌ 1న మొదలైన ఏకైక టెస్ట్‌ ద్వారా 25 ఏళ్ల జాష్​ టంగ్‌ అనే ఇం‍గ్లండ్‌ పేసర్‌.. అంతర్జాతీయ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే 14 ఏళ్ల క్రితమే అతను ఎప్పటికైనా అంతర్జాతీయ క్రికెట్​కు ఆడతాడన్న విషయాన్ని తెలిపిన ఓ ఫ్యామిలీ ఫ్రెండ్​కు ఏకంగా రూ. 50 లక్షల సొమ్మును బెట్టింగ్​లో గెలిచాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే..
11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే టంగ్‌పై.. టిమ్‌ పైపర్‌ అనే అతని ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఓ పందెం కాసాడు. టంగ్​ భవిష్యత్తులో ఇంగ్లండ్‌ నేషనల్​ టీమ్​కు ఆడతాడని.. అతనిపై అ‍ప్పట్లోనే కొంత మొత్తాన్ని బెట్​ కట్టాడు. కాగా ఇప్పుడు ఆయన మాటలు అక్షర సత్యాలై.. టంగ్‌ ఇంగ్లండ్‌ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతనిపై పందెం కాసిన టిమ్​కు 50000 పౌండ్స్​ అంటే భారత కరెన్సీలో సుమారు రూ.50 లక్షలు వచ్చాయి.

కాగా టంగ్‌.. చిన్నతనం నుంచి క్రికెట్‌ ఆడటాన్ని గమినిస్తూ వచ్చిన టిమ్‌, అతను ఏదో ఒక రోజు ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు ఆడతాడని అన్నాడట. ఇక ఇప్పుడు టంగ్‌ ఇంగ్లండ్‌ 711వ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చి.. తన కుటుంబ సభ్యుల సమక్షంలో జిమ్మీ ఆండర్సన్​ చేతుల మీదగా టెస్ట్‌ క్యాప్‌ అందుకున్నాడు. ఈ మధుర క్షణాలను ఇంగ్లాండ్ క్రికెట్​ టీమ్​ తమ ట్విట్టర్ హ్యాండిల్​లో షేర్ చేసింది.

  • With his mum, dad, partner and son all watching on...

    Jimmy Anderson presents Josh Tongue with his very first England cap ❤️🧢

    A special moment for the whole family 👨‍👩‍👦

    Congratulations, Josh 👏 pic.twitter.com/FTew4m8y1o

    — England Cricket (@englandcricket) June 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే ఐర్లాండ్‌తో టెస్ట్‌కు మొదట్లో ప్రకటించిన ఇంగ్లండ్‌ జట్టులో టంగ్‌కు చోటు దక్కలేదు. నలుగురు పేసర్లు వివిధ కారణాల వల్ల అందుబాటులోకి రాకపోవడంతో.. ఆఖరి నిమిషంలో టంగ్‌కు ఇంగ్లాండ్​ జట్టులో చోటుదక్కింది. కౌంటీల్లో వోర్సెస్టర్‌షైర్‌ తరపున అద్భుతంగా రాణించడం వల్ల టంగ్‌ను సెలెక్టర్లు ఎంచుకున్నారు. కాగా టంగ్‌.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 82 ఇన్నింగ్స్‌లలో 162 వికెట్లు పడగొట్టాడు.

ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జ‌ట్లు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే యాషెస్ టెస్టు సిరీస్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సిరీస్​ జూన్ 16న మొద‌ల్వ‌నుంది.ఈ ఏడాది ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ త‌ర్వాత యాషెస్ టెస్టు సిరీస్ మొద‌లుకానుంది. ఇంగ్లండ్‌లోని ఓవ‌ల్ స్టేడియం వేదిక‌గా భారత్, ఆస్ట్రేలియా మ‌ధ్య టెస్టు ఛాంపియ‌న్‌షిప్ జ‌ర‌గ‌నుంది. 2021లో ఫైన‌ల్ చేరిన భార‌త్.. ఆఖ‌రి పోరులో చతికిలపడింది. న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓట‌మి పాలైంది. దాంతో, టీమ్​ఇండియా ఈసారి క‌ప్పు కొట్టాల‌నే క‌సితో ఉంది.

Last Updated : Jun 2, 2023, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.