ETV Bharat / sports

'అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. క్రెడిట్​ మొత్తం వాళ్లకే'

ఆసీసీతో జరిగిన తొలి టెస్ట్​లో ఘనవిజయం అనంతరం టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ స్పందించాడు. ఆస్ట్రేలియా కేవలం ఒక సెషన్‌లోనే పతనమవుతుందని ఊహించలేదని హిట్​మ్యాన్​ అన్నాడు. ఇంకేమన్నాడంటే?

rohit sharma
rohit sharma
author img

By

Published : Feb 12, 2023, 10:45 AM IST

నాగ్‌పుర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్​లో టీమ్​ఇండియా ఘనవిజయం సాధించింది. మూడో రోజుల్లో మ్యాచ్‌ను ముగించిన భారత్‌.. ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 223 పరుగుల వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అశ్విన్‌ 5 వికెట్లు, జడేజా రెండు వికెట్లతో ఆసీస్‌ పతనాన్ని శాసించారు.

అయితే ఆస్ట్రేలియా కేవలం ఒక సెషన్‌లోనే పతనమవుతుందని ఊహించలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌లో రోహిత్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. " ఆస్ట్రేలియా కేవలం కేవలం ఒక సెషన్‌లోనే కుప్పకూలుతుందని నేను అస్సలు ఊహించలేదు. మేము బౌలింగ్‌లో తీవ్రంగా కష్టపడాలని ముందే నిర్ణయించుకున్నాం.

సెషన్‌ సెషన్‌కు ఆస్ట్రేలియాపై పట్టు సాధించాలని అనుకున్నాం. కానీ అదింతా ఒకే సెషన్‌లో జరుగుతుందని మేము అసలు అనుకోలేదు. అయితే పిచ్‌పై ఎటువంటి బౌన్స్‌ లేకపోవడం నాకు కొంత ఆశ్చర్యం కలిగించించింది. ఏదేమైనప్పటికీ మా స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. కాబట్టి క్రెడిట్‌ మొత్తం వాళ్లకే దక్కాలి" అని పేర్కొన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ దిల్లీ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 17) నుంచి ప్రారంభం కానుంది.

ఫైనల్​కు టీమ్​ఇండియా?
తొలి టెస్టులో ఘన విజయం సాధింన భారత్​.. వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ పోరుకు మరో అడుగు ముందుకేసింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్స్​ టేబుల్​లో.. టీమ్ఇండియా రెండో స్థానంలో నిలిచింది. దీంతో గెలుపు శాతం నాగ్‌పుర్‌ టెస్టుకు ముందు 58.93గా ఉండగా.. విజయానంతరం అది 61.67 శాతానికి పెరిగింది. ఇక ఈ పాయింట్ల పట్టికలో మొదటి ప్లేస్​లో ఉన్న ఆస్ట్రేలియా గెలుపు శాతం 75.56 నుంచి 70.83కు పడిపోయింది. గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన టీమ్‌ఇండియా.. ఈసారి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలంటే బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌లోని మిగతా మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండింట్లో గెలవాలి. అయితే శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల డబ్ల్యూటీసీ ఫైనల్​ అవకాశాలు కూడా బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీపై ఆధారపడి ఉన్నాయి.
ప్రస్తుతం ఈ జట్లు డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్​ టేబుల్​లో మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ, ఈ సిరీస్‌లో కంగారూ జట్టు పుంజుకుని 2-2తో విజయం సాధించి.. మరోవైపు కివీస్​తో సిరీస్‌ను శ్రీలంక 2-0తో గెలిస్తే.. భారత్‌ ఫైనల్‌ సమరానికి దూరమయ్యే అవకాశాలున్నాయి. కాగా, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ జట్లు ఇప్పటికే ఫైనల్‌ రేసు నుంచి తప్పుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.