ETV Bharat / sports

ధోనీ క్యాండీక్రష్​..​​ ఎయిర్ ​హోస్టెస్ స్పెషల్​ చాక్లెట్​.. 3 గంటల్లో 30 లక్షల డౌన్​లోడ్స్​..

Dhoni Candy Crush : భారత జట్టు మాజీ సారథి ఎమ్​ఎస్​ ధోనీ.. విమానంలో క్యాండీక్రష్​ గేమ్ ఆడుతూ కనిపించాడు. ఎయిర్ హోస్టెస్​ అతడికి ఓ స్పెషల్​ చాక్లెట్​ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ కాగా.. క్యాండీక్రష్ ​యాప్​ను 3 గంటల్లో 30 లక్షల మందికి పైగా డౌన్​లోడ్ చేసుకున్నారు. ఆ వీడియో మీరు చూశారా?

dhoni candy crush
dhoni candy crush
author img

By

Published : Jun 26, 2023, 11:39 AM IST

Updated : Jun 26, 2023, 11:52 AM IST

Dhoni Candy Crush : టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ ఎమ్ఎస్​ ధోనీకి ఫుల్​ ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. అతడు ఎక్కడికి వెళ్లినా.. చిన్న, పెద్ద తేడా లేకుండా అభిమానులు నీరాజనం పడతారు. కేవలం ధోనీ కోసమే క్రికెట్ చూసే వాళ్లూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ధోనీ ప్రయాణిస్తున్న విమానంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను కొద్ది సేపట్లోనే నెట్టింట్లో వైరల్ చేశారు.​ కామెంట్ల రూపంలో రకరకాలుగా స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Dhoni Aeroplane Video : ధోనీ.. అతడి భార్య సాక్షితో ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా.. ఓ ఎయిస్​ హోస్టెస్​ అతడికి చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్​తో కూడిన ఓ ట్రేను ఇచ్చింది. అందులో నుంచి కేవలం డ్రై ఫ్రూట్స్​ మాత్రమే తీసుకుని.. చాక్లెట్లను సున్నింతగా తిరస్కరించాడు ధోనీ. అనంతరం ఆమెతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించాడు. ఈ వీడియో సోషల్​ మీడియాలో పోస్టు చేయగా.. కొద్ది సేపట్లోనే వైరల్​గా మారింది.

అయితే ఆ వీడియోలో.. ధోనీ ట్యాబ్​లో క్యాండీ క్రష్​ గేమ్​ ఆడుతున్నట్లు అభిమానులు గమనించారు. అనంతరం ఆ విడియో కింద కామెంట్లతో మారు మోగించారు. ' హాహా ధోనీ.. నువ్వు కూడా క్యాండీ క్రష్​ ఆడతావా!' అని ఓ యూజర్​ స్పందించగా.. 'ధోనీ భాయ్​.. క్యాండీ క్రష్​లో ఇప్పుడు ఏ లెవెల్​కి వచ్చావు' అని మరో యూజర్ రాసుకొచ్చాడు. అయితే, ఇందులో మరో ట్విస్ట్​ ఎంటంటే.. ఈ విషయం వైరల్ అయిన తర్వాత 30 లక్షల మందికి పైగా క్యాండీ క్రష్​ యాప్​ డౌన్​లోడ్​ చేసుకోవడం విశేషం. ఈ మేరకు క్యాండీ క్రష్.. వారి ట్విట్టర్​ హ్యాండిల్​లో వెల్లడిస్తూ.. తమను ట్రెండింగ్​లోకి తీసుకువచ్చినందుకు ధోనీకి కృతజ్ఞతలు తెలిపింది.

MS Dhoni Career Span : మే చివర్లో జరిగిన ఐపీఎల్ ఫైనల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​.. గుజరాత్​పై విజయం సాధించి ఐదోసారి టైటిల్​ గెలిచింది. ఆ టీమ్​కు ధోనీ సారథ్యం వహించాడు. దాదాపు రెండు నెలలు సాగిన ఈ టోర్నీలో.. చివరి ఓవర్లలో వస్తూ.. అభిమానులను అలరించాడు. అయితే, ఇదే ధోనీకి చివరి ఐపీఎల్ అనుకున్న తరుణంలో.. అన్ని బాగుంటే వచ్చే ఏడాది కూడా ఆడతానని ధోనీ చెప్పాడు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఐపీఎల్ ముగిశాక ధోని మోకాలి సర్జరీ చేయించుకున్నాడు.
Dhoni Stats : 2004 నుంచి 2019 వరకు సాగిన అతడి అంతర్జాతీయ కెరీర్​లో.. 44.9 సగటుతో మొత్తం 17,266 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 108 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 224 పరుగులు.

Last Updated : Jun 26, 2023, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.