సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ శుభవార్త అందించాడు. సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఇన్‌స్టా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. 'ఐ విల్ బి బ్యాక్' అనే క్యాప్షన్‌తో సన్‌రైజర్స్ దుస్తులతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అయితే నిరవధిక వాయిదా పడిన ఈ ఐపీఎల్లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడిపోయింది సన్‌రైజర్స్. వరుస పరాజయాల నేపథ్యంలో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కనీసం తుది జట్టులోనూ చోటు ఇవ్వలేదు. కేన్ విలియమ్సన్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అనంతరం లీగ్ వాయిదా పడగా.. రెండో దశలో వార్నర్ ఆడటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటికి సమాధానంగా తాను ఆడబోతున్నట్లు స్పష్టం చేశాడు వార్నర్.