ఇంగ్లాండ్‌తో జరిగిన పోరులో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో విజయ్ శంకర్ స్థానంలో పంత్‌కు అవకాశం దొరికింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. అయితే ఆడిన మొదటి మ్యాచ్‌లోనే రిషభ్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించడం మంచిది కాదని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
ఇంగ్లాండ్‌కు చావోరేవో మ్యాచ్.. అదీ టీమిండియాతో.. ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది మోర్గాన్ సేన. అనూహ్య ఓటములతో సెమీస్ ఆశలు సంక్లిష్టం చేసుకుంది. భారత్‌పై గెలిచి సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంచుకోవాలని భావించిన ఇంగ్లాండ్ జట్టు అదే రీతిలో ఆడింది. అయితే ఈ మ్యాచ్‌లో విజయ్ శంకర్ స్థానంలో పంత్‌కు చోటు లభించింది. టీమిండియాకు ఎప్పటి నుంచో ఆందోళన కలిగిస్తోన్న నాలుగో స్థానంలో రిషభ్ బ్యాటింగ్‌కు దిగాడు. భారత్ గెలిస్తే ఎలా ఉండేదో కానీ.. కోహ్లీ సేన ఓటమి తర్వాత ఈ స్థానంపై మరోసారి చర్చ మొదలైంది.
మ్యాచ్ అనంతరం పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై ఓ విలేకరి రోహిత్‌ను ప్రశ్నిస్తూ.. అంత కఠిన పరిస్థితుల్లో పాండ్యను కాదని పంత్‌కు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం ఆశ్చర్యకరంగా అనిపించ లేదా అని అడిగాడు. దీనిపై రోహిత్ స్పందిస్తూ..
"ఆశ్చర్యకరం అనిపించలేదు. ఎందుకంటే మీరంతా పంత్‌ను నాలుగో స్థానంలో చూడాలనుకున్నారు. టీమిండియా అభిమానులు కూడా రిషభ్ పంత్ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ఈ మ్యాచ్ సమాధానం" అని తెలిపాడు.
-
Journalist: Were you surprised to see Rishabh Pant come out at four?
— INTENTional 7™ 👣 (@AngryUncle7) July 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Rohit Sharma: 😐... 😂 #ENGvIND | #CWC19 pic.twitter.com/ktEr6aRlGP
">Journalist: Were you surprised to see Rishabh Pant come out at four?
— INTENTional 7™ 👣 (@AngryUncle7) July 1, 2019
Rohit Sharma: 😐... 😂 #ENGvIND | #CWC19 pic.twitter.com/ktEr6aRlGPJournalist: Were you surprised to see Rishabh Pant come out at four?
— INTENTional 7™ 👣 (@AngryUncle7) July 1, 2019
Rohit Sharma: 😐... 😂 #ENGvIND | #CWC19 pic.twitter.com/ktEr6aRlGP
"పంత్ భారీ షాట్స్ ఆడే ముందు మరింత ఆలోచించాలి. ప్రపంచకప్‌లో పంత్‌కు ఇది మొదటి మ్యాచ్మాత్రమే. ఈ దశలో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించడం కూడా మంచిది కాదు. మిడిల్లో ఇంకాస్త సమయం వెచ్చించాలి. పిచ్ పరిస్థితులను అంచనా వేయాలి. రిషభ్‌ను నాలుగో స్థానంలో పంపడం సరైన నిర్ణయమే. అతడి ప్రతిభ అందరికీ తెలుసు".
-రోహిత్, టీమిండియా వైస్ కెప్టెన్
గాయం కారణంగానే విజయ్ శంకర్ జట్టుకు దూరమయ్యాడని అన్నాడు రోహిత్. కుల్దీప్, చాహల్‌కు కలిసిరాలేదని.. వారు మరింత మంచి ప్రదర్శన కనబర్చగలరని తెలిపాడు.
ఇవీ చూడండి.. 'టీమిండియా ఓటమికి ఆరెంజ్ జెర్సీనే కారణం'