ETV Bharat / sports

స్మిత్​ అద్భుత పోరాటం... ఇంగ్లాండ్​ లక్ష్యం 224 - వోక్స్

బర్మింగహామ్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన రెండో సెమీఫైనల్​ మ్యాచ్​లో ఆసీస్​ నామమాత్రపు స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్​ చేసిన ఫించ్​ సేన నిర్ణీత 50 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌటైంది. 85 పరుగులతో స్టీవ్​​ స్మిత్​ ఒంటరి పోరాటం చేయడం వల్ల ఇంగ్లాండ్​కు ఆ మాత్రం లక్ష్యం నిర్దేశించ గలిగింది.

స్మిత్​ అద్భుత పోరాటం... ఇంగ్లాండ్​ లక్ష్యం 224
author img

By

Published : Jul 11, 2019, 7:17 PM IST

బర్మింగ్​హామ్​ వేదికగా జరిగిన సెమీఫైనల్​-2 మ్యాచ్​లో ఆస్ట్రేలియా సాధారణ లక్ష్యాన్నే ప్రత్యర్థి ముందు ఉంచింది. 50 ఓవర్లలో ఆలౌట్​ అయిన ఆసీస్​ 223 పరుగులు చేసింది. స్మిత్​(85), కేరీ (46) కీలక ఇన్నింగ్స్​ ఆడారు. మ్యాక్స్​వెల్​, స్టార్క్​ ఫర్వాలేదనిపించారు.

  • That's a wrap!

    A brilliant bowling display from England sees Australia all out for 223! Steve Smith battled hard for the Aussies with his 85 – could that be a match-winning knock?#AUSvENG | #CWC19 pic.twitter.com/REgouHphe5

    — Cricket World Cup (@cricketworldcup) July 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నిరాశపర్చిన ఓపెనర్లు

తొలి బంతికే పరుగులేమీ చేయకుండా గోల్డెన్​ డకౌట్​గా వెనుదిరిగాడు ఆసీస్​ సారథి ఫించ్​. జోఫ్రా ఆర్చర్ వేసిన​ అద్భుతమైన లైన్​ అండ్​ లెంగ్త్​ బంతికి ఎల్బీగా పెవిలియన్​ చేరాడు. 3వ ఓవర్​ వేసిన వోక్స్​ ఆసీస్​ వెన్నెముక వార్నర్​ను ఔట్​ చేశాడు. బెయిర్​ స్టోకు క్యాచ్​ ఇచ్చి మైదానం వీడాడు డేవిడ్​ వార్నర్​. ఈ మ్యాచ్​లో తుది చోటు దక్కించుకున్న హ్యాండ్స్​కాంబ్​ 4 పరుగుల స్పల్ప స్కోరుకే ఔటయ్యాడు. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆసీస్​. తొలి పవర్​ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయి 27 రన్స్​ మాత్రమే చేసి చెత్త రికార్డు మూటగట్టుకుంది.

స్మిత్​ పోరాటం..

కష్టాల్లో కూరుకుపోయిన జట్టును తన అనుభవంతో నడిపించాడు స్మిత్. ఇంగ్లాండ్​ పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటూ​ 85(119 బంతుల్లో; 6 ఫోర్లు) రన్స్​ సాధించాడు. మరో బ్యాట్స్​మెన్​ కేరీ బలమైన గాయం తగిలినా 46 పరుగులతో (70 బంతుల్లో; 4 ఫోర్లు) మంచి సహకారం అందించాడు.

మ్యాక్స్​వెల్​(22)వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. ఆఖర్లో వచ్చిన స్టార్క్​(29)స్మిత్​తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. కుదురుకొని స్కోరు బోర్డు పరుగులెత్తించే క్రమంలో ఇద్దరూ వరుస బంతుల్లో ఔటవ్వడం వల్ల 223 పరుగులకే పరిమితమైంది.

ఇంగ్లాండ్​ బౌలర్లలో అదిల్​ రషీద్​, వోక్స్​ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. జోఫ్రా ఆర్చర్​ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆర్చర్​ పొదుపుగా బౌలింగ్​ చేయడమే కాకుండా కీలక వికెట్లు తీశాడు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.