ETV Bharat / sports

అలా ధోనీ, సాక్షి ప్రేమలో పడ్డారు

మైదానంలో ప్రశాంతమైన ఆటతీరుతో టీమ్​ఇండియాకు ఎన్నో విజయాలనందించాడు మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీ. అయితే అతడి జీవితంలో క్రికెట్​కు మించిన ఓ ఆసక్తికరమైన ప్రేమకథ కూడా ఉంది. ఆ ప్రేమకథే ధోనీ, సాక్షి మూడు ముళ్ల బంధానికి దారీ తీసింది. నేడు వీరిద్దరి పెళ్లిరోజు సందర్భంగా వారి లవ్​స్టోరీపై ఓ లుక్కేద్దాం.

Dhoni and Sakshi r
ధోనీ సాక్షి
author img

By

Published : Jul 4, 2020, 11:32 AM IST

సెలబ్రిటీల లవ్​స్టోరీ, పెళ్లి టాపిక్​.. ఇలా వారి వ్యక్తిగత జీవిత విషయాలను తెలుసుకోవడంలో ఉత్సుకత చూపించడం సర్వసాధారణం. అయితే క్రికెట్​ విషయానికొస్తే కోహ్లీ, హార్దిక్, రోహిత్​ సహా కొంతమంది ఆటగాళ్ల ప్రేమకథలను విని ఉంటాం. వీరు సోషల్​మీడియా లేదా ప్రత్యేక ఇంటర్వ్యూల ద్వారా తమ వ్యక్తిగత విశేషాలను అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు.

కానీ స్టార్​ కపుల్​ టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీ, సాక్షి లవ్​స్టోరీ మాత్రం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే వారిద్దరు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ విషయమైన అభిమానులతో పంచుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయినా తెలుసుకోవాలనే ఉత్సుకత మాత్రం ప్రతిఒక్క అభిమానికి తప్పకుండా ఉంటుంది. నేడు వీరిద్దరి పెళ్లి రోజు సందర్భంగా వారి లవ్​స్టోరి గురించి ప్రత్యేక కథనం మీకోసం..

Dhoni and Sakshi r
ధోనీ సాక్షి

చిన్నప్పటి నుంచే

ధోనీ, సాక్షి తండ్రులు ఇద్దరు ఒకేచోట కలిసి పనిచేసేవారు. అలా వీరిద్దరు కూడా ఒకే చోట కలిసి చదువుకున్నారు. అయితే మహీ మాత్రం సాక్షికి సీనియర్​. కానీ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆ తర్వాత సాక్షి తండ్రికి ఉద్యోగం బదిలీ అవ్వడం వల్ల వేరే చోటుకు తమ మకాం మార్చారు. దీంతో వీరు చాలా కాలం దూరంగానే ఉన్నారు.

అలా ప్రేమలో పడ్డారు

2007లో అనుకోకుండా ఓ కామన్​ స్నేహితుడి ద్వారా వీరిద్దరు మళ్లీ కలుసుకున్నారు. అప్పటికే మహీ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అదే సమయంలో సాక్షి ఓ హోటల్​లో ఇంటర్న్​షిప్​ చేస్తోంది. అనుకోకుండా ఓ రోజు మ్యాచ్​లో భాగంగా అదే హోటల్​లో బసకు దిగారు టీమ్​ఇండియా ఆటగాళ్లు. అయితే సాక్షికి తెలియకుండా ఆ హోటల్​ మేనేజర్​ దగ్గర నుంచి ఆమె ఫోన్​ నెంబరు తీసుకుని తనకు మెసేజ్​లు చేయడం ప్రారంభించాడు ధోనీ. అలా క్రమక్రమంగా వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. అలా వీరిద్దరు 2008లో ప్రేమలో పడ్డారు. అప్పటికే పలువురు బాలీవుడ్​ భామలతో ధోనీకి అఫైర్స్ నడుస్తున్నట్లు చాలా పుకార్లు కూడా వచ్చాయి. కానీ వాటన్నింటికి చెక్​ పెడుతూ 2010లో జులై 4న సాక్షిని వివాహమాడాడు మహీ. ప్రస్తుతం వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉంది.

నీలినీడలు

గతేడాది ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో సెమీస్​లో చివరగా ఆడిన ధోనీ.. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. దీంతో పంత్​, కేఎల్​ రాహుల్​ టీమ్​ఇండియా వికెట్​కీపర్​గా​ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. అయితే ఐపీఎల్​లో ఆడి, టీ20 ప్రపంచకప్​ జట్టులో చోటు దక్కించుకోవాలని ధోనీ భావించాడు. కానీ కరోనా ప్రభావంతో ప్రపంచకప్​ వాయిదా పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో మహీ అంతర్జాతీయ కెరీర్​పై నీలినీడలు కమ్ముకున్నాయి.

Dhoni and Sakshi
ధోనీ, సాక్షి అలా ప్రేమలో పడ్డారు

ఇది చూడండి : 'నేను చూశా.. ధోనీలో జోరు ఏమాత్రం తగ్గలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.