ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచవ్యాప్తంగా భారీ జనాదరణ ఉన్న క్రికెట్ లీగ్‌ల్లో ఒకటి. ఈ టోర్నీ మొదలైతే రెండు నెలలు భారత్‌లో పండగ వాతావరణమే. అలాంటి ఈ క్రీడాసంబరం కరోనా వల్ల జరుగుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది. అయితే కాసుల వర్షం కురిపించే ఈ టోర్నీ నిర్వహించే ఛాన్స్ 'మాకు ఇవ్వండి' అంటూ బహిరంగంగానే ప్రకటన చేస్తున్నాయి కొన్ని దేశాల బోర్డులు. తాజాగా ఆ జాబితాలో యూఏఈ చేరింది.
ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించేందుకు అవకాశమిస్తే.. తాము సిద్ధంగా ఉన్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బోర్డు ప్రకటించింది. ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐకి ప్రతిపాదించినట్లు వచ్చిన వార్తలను ధ్రువీకరించింది. ఇప్పటికే ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు శ్రీలంక ఆసక్తి చూపుతోంది.
" గతంలో యూఏఈ బోర్డు విజయవంతంగా ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించింది. వివిధ దేశాల మధ్య తటస్థ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన చరిత్ర మాకుంది. ఐపీఎల్‌తో పాటు ఇంగ్లాండ్ సీజన్ మ్యాచ్‌లూ నిర్వహించేందుకు ఆయా దేశాల బోర్డులకు తెలియజేశాం. మా ప్రతిపాదన అంగీకరిస్తే సంతోషిస్తాం".
-- యూఏఈ బోర్డు
ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ రద్దయితే.. అక్టోబర్‌లో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. టీ20 వరల్డ్‌కప్ నిర్వహణపై ఈ నెల 10న కీలక నిర్ణయం ప్రకటించనుంది ఐసీసీ.
- ఇవీ చూడండి: