ETV Bharat / sports

'కెప్టెన్​గా కోహ్లీ తర్వాత ఇతడే సరైన వ్యక్తి​'

author img

By

Published : May 2, 2020, 1:31 PM IST

టీమిండియా భవిష్యత్తు సారథిగా కేఎల్​ రాహుల్​ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డాడు భారత బౌలర్​ శ్రీశాంత్​. ప్రస్తుత సారథి విరాట్​ కోహ్లీలా జట్టును ముందుకు నడిపించే సామర్థ్యం అతడికి ఉందని చెప్పాడు.

Sreesanth wants KL Rahul to lead Team India after Virat Kohli and Rohit Sharma
టీమిండియా జట్టు సారథిగా కేఎల్​ రాహుల్​!

లాక్​డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్న క్రికెటర్లు, సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. అభిమానులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు తమదైన రీతిలో సమాధానాలిస్తున్నారు. ఈ క్రమంలో లైవ్ చాట్ సెషన్​లో పాల్గొన్న భారత బౌలర్ శ్రీశాంత్.. భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్​గా కేఎల్ రాహుల్ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డాడు.

"భవిష్యత్తులో టీమిండియా సారథిగా కేఎల్​ రాహుల్​ సరైన వ్యక్తి అని నా అభిప్రాయం. ఎందుకంటే అతడు ఎంతో బాధ్యత, నిబద్ధత, ప్రణాళికతో ఆడుతున్నాడు. కోహ్లీలా నైతిక విలువలు పాటిస్తూ, వ్యూహాలు రచిస్తూ బ్యాటింగ్ చేస్తున్నాడు. విరాట్​లా జట్టును ముందుకు నడిపించే సామర్థ్యం అతడికి ఉంది"

-శ్రీశాంత్​, టీమిండియా క్రికెటర్​

విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ.. ప్రస్తుతం భారత జట్టును ముందుండి నడిపిస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు కోహ్లీ సారథ్యం వహిస్తుండగా.. అప్పుడప్పుడు రోహిత్ ఆ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నాడు.​ ఐపీఎల్​లో హిట్​మ్యాన్​ కెప్టెన్సీలోనే ముంబయి ఇండియన్స్​ నాలుగుసార్లు విజేతగా నిలిచింది​.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.