అఫ్ఘానిస్థాన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ షఫికుల్లా షఫిక్‌పై ఆరేళ్ల నిషేధం విధించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాడంటూ వచ్చిన ఆరోపణలను అంగీకరించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఈ నిషేధం అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని తెలిపారు.
"మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను షఫికుల్లా అంగీకరించాడు. బుకీలు తనను సంప్రదించిన మాట వాస్తవమని.. వారి ఆఫర్‌కు తాను ఒప్పుకున్నట్లు తెలిపాడు. అందువల్ల తక్షణమే అతడిపై నిషేధం విధించాం. అన్ని ఫార్మాట్లకు ఇది వర్తిస్తుంది."
-అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు
2018లో ప్రారంభమైన అఫ్ఘానిస్థాన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2019 టోర్నీల్లో షఫికుల్లా ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు షఫికుల్లా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు స్పష్టం చేసింది.