ETV Bharat / sports

రహానే, పంత్, శ్రేయస్​లకు రోహిత్ సవాల్

యువరాజ్ విసిరిన #KeepItUp ఛాలెంజ్​ను పూర్తి చేశాడు రోహిత్ శర్మ. అనంతరం రహానే, శ్రేయస్, పంత్​లను నామినేట్ చేశాడు.

author img

By

Published : May 17, 2020, 2:02 PM IST

రోహిత్
రోహిత్

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ #KeepItUp ఛాలెంజ్​తో ముందుకొచ్చాడు. అతడు సచిన్​ తెందూల్కర్​, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్ ఈ ఛాలెంజ్​ను స్వీకరించాలని కోరాడు. ఇప్పటికే సవాల్​ను సచిన్, హర్భజన్ పూర్తి చేయగా.. తాజాగా రోహిత్ శర్మ ఛాలెంజ్​ స్వీకరించాడు.

బ్యాట్ హ్యాండిల్​తో బంతిని కొడుతూ ఛాలెంజ్​ను పూర్తి చేశాడు. "ఇంటివద్దే ఉండటానికి నేను కట్టుబడి ఉన్నా. అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్​లను నామినేట్ చేస్తున్నా" అంటూ పోస్ట్ చేశాడు.

ఇప్పటికే ఈ ఛాలెంజ్​ను సచిన్ పూర్తి చేశాడు. తన కళ్లకు గంతలు కట్టుకుని సవాల్‌ను పూర్తిచేసి యువీకి ప్రతి సవాల్‌ విసిరాడు. "యువీ నువ్వు నాకు చాలా సులభమైన ఛాలెంజ్ ఇచ్చావు. కానీ నేను ఇప్పుడు నీకు కష్టమైన ఛాలెంజ్‌ను ఇస్తున్నా" అంటూ సచిన్‌ పోస్ట్‌ చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.