ETV Bharat / sports

పోలీసులతో జడేజా సతీమణి వాగ్వాదం - రవీంద్ర జడేజా సతీమణి రివాబ

టీమ్​ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా చిక్కుల్లో పడింది. మాస్క్ ధరించలేదని ప్రశ్నించగా ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగిందని సమాచారం.

పోలీసులతో జడేజా సతీమణి వాగ్వాదం
పోలీసులతో జడేజా సతీమణి వాగ్వాదం
author img

By

Published : Aug 11, 2020, 7:24 PM IST

టీమ్‌ఇండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి రివాబా చిక్కుల్లో పడింది. మాస్క్ ధరించలేదని ప్రశ్నించగా ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగిందని సమాచారం. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారని తెలిసింది.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సతీమణితో కలిసి జడేజా కారులో ప్రయాణిస్తున్నారు. జడ్డూ మాస్క్‌ ధరించగా రివాబా మాత్రం ధరించలేదు. దీనిని గుర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ సోనాల్‌ గొసాయి కిసాన్‌పరా చౌక్‌ వద్ద కారును ఆపారు. మాస్క్‌ ఎందుకు ధరించలేదని ప్రశ్నించగా రివాబా వాగ్వాదానికి దిగిందని డిప్యూటీ పోలీసు కమిషనర్‌ మనోహర్‌ సిన్హా తెలిపారు. అయితే ఇరువురు పరస్పరం దూషించుకున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు.

ఐపీఎల్‌-2020 కోసం జడ్డూ సిద్ధమవుతున్నాడు. త్వరలోనే చెపాక్‌లోని చెన్నై సూపర్‌కింగ్స్‌ శిబిరానికి చేరుకుంటాడు. ఆ తర్వాత 24 గంటల వ్యవధిలో రెండుసార్లు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. నెగెటివ్‌ వస్తే ఆగస్టు 22న దుబాయ్‌కి వెళ్తాడు. అంతర్జాతీయ క్రికెటర్లలో అత్యంత చురుకైన ఆటగాడిగా జడ్డూకు పేరుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.