ETV Bharat / sports

'ఆరెంజ్ జోన్​లోకి వచ్చేశా.. వెళ్లి మందు తెచ్చుకుంటా'

తన ప్రాంతం ఆరెంజ్ జోన్​లోకి వచ్చేసిందని చెప్పిన టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. నిబంధనలు పాటించి, మద్యం తెచ్చుకుంటానని అన్నాడు.

'ఆరెంజ్ జోన్​లోకి వచ్చేశా.. వెళ్లి మందు తెచ్చుకుంటా'
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి
author img

By

Published : May 6, 2020, 1:28 PM IST

టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి.. తన ఉంటున్న అలీబాగ్ ప్రాంతం రెడ్​ నుంచి ఆరెంజ్ జోన్​లోకి రావడంపై ఆనందం వ్యక్తం చేశాడు. మద్యం షాపులు తెరిచిన వెంటనే వెళ్లి, బీర్ తెచ్చుకుంటానని అన్నాడు. అక్కడ జనాలు నిబంధనలు పాటించకున్నా.. తాను మాత్రం మాస్క్​ ధరించి, భౌతిక దూరం పాటించి వాటిని కొనుగోలు చేస్తానని చెప్పాడు.

ఈ సమయంలో అవకాశమొస్తే ఎవరితో కలిసి మందు తాగుతారు? అన్న ప్రశ్నకు సమధానంగా.. మాజీ క్రికెటర్లు రోజర్ బిన్నీ, శివరామకృష్ణన్​లతో కలిసి తాగుతానని రవిశాస్త్రి చెప్పాడు.

1981-92 మధ్య టీమిండియా తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఇతడు.. 2017 జులై నుంచి కోహ్లీసేనకు ప్రధాన కోచ్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.