గతసీజన్లో న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టుకు తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన సోఫీ డివైన్‌ను పూర్తి కాల కెప్టెన్‌గా ప్రకటించింది కివీస్ క్రికెట్ బోర్డు. దీంతోపాటు మాతృత్వ సెలవులు తీసుకుని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మరో కీలక క్రికెటర్ అమీ శాటర్త్ వైట్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది.
"అమీ శాటర్త్ వైట్‌తో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. జట్టుకు బలమైన భాగస్వామ్య నాయకత్వంగా మేమిద్దరం నిలుస్తామని భావిస్తున్నా."
-సోఫీ డివైన్, కివీస్ సారథి.
"మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. జట్టు విజయానికి నా వంతు కృషి చేస్తా. "
- అమీ శాటర్త్ వైట్, న్యూజిలాండ్ వైస్ కెప్టెన్.
ఈ బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు సోఫీ-అమీ. వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ మహిళా ప్రపంచకప్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇది చూడండి : ఈ పాపే జూనియర్ బోల్ట్ 'లైట్నింగ్'