ETV Bharat / sports

'నాన్​హానర్స్​' బోర్డు.. ఆ గౌరవం దక్కని వారి కోసమే! - లార్డ్​లో సచిన్​ బోర్డు

క్రికెట్​లో ఉన్నతంగా రాణించినా లార్డ్స్​ మైదానంలో సెంచరీ కల నెరవేర్చుకోలేకపోయిన మాజీ ఆటగాళ్లకు అరుదైన గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది అక్కడి యాజమాన్యం. వారి పేర్లతో నాన్​హానర్స్‌ బోర్డు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం 11 మందితో జట్టును ప్రకటించింది. భారతీయ ఆటగాళ్లలో సచిన్​, సెహ్వాగ్​ సహా ప్రస్తుత టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ సైతం ఈ బృందంలో చోటు దక్కించుకున్నాడు.

Lord's Cricket Ground named Sachin, Sehwag, Kohli name in Non-Honours Board XI
ఆ గౌరవం దక్కని వారితో ఓ జట్టు
author img

By

Published : May 28, 2020, 11:32 AM IST

క్రికెట్‌ మక్కాగా పిలిచే లార్డ్స్‌లో... సెంచరీ, ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు లేదా మ్యాచ్‌లో పది వికెట్ల ప్రదర్శన చేసిన వారి పేర్లను హానర్స్‌ బోర్డుపై రాస్తారు. ఇప్పటి వరకు 400 మందికి పైగా క్రికెటర్లు ఇలా హానర్స్‌ బోర్డు ఎక్కారు. అయితే దిగ్గజ క్రికెటర్లు కొందరికి మాత్రం ఆ కల నెరవేరలేదు. అందులో సచిన్‌ కూడా ఉన్నాడు.

టెస్టు కెరీర్లో 51 టెస్టు సెంచరీలు చేసిన మాస్టర్​కు.. లార్డ్స్‌లో ఒక్క శతకం కూడా లేదు. ఇలా ప్రత్యేక ప్రదర్శన చేయలేకపోయిన దిగ్గజ ఆటగాళ్లతో.. లార్డ్స్‌ క్రికెట్‌ మైదానం 11 మంది సభ్యుల జట్టును రూపొందించింది. ఇందులో భారత్​ నుంచి సచిన్​ సెహ్వాగ్​తో పాటు ప్రస్తుత టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ నిలిచాడు.

ఆ జట్టుకు కెప్టెన్​గా డబ్ల్యూ.జి గ్రేస్‌ ఉండగా... సచిన్‌, సెహ్వాగ్‌, కోహ్లీ, లారా, గిల్‌క్రిస్ట్‌, వార్న్‌, వసీం అక్రమ్‌, డెన్నిస్‌ లిల్లీ, అంబ్రోస్, కలిస్​‌ జట్టులో సభ్యులు.

Lord's Cricket Ground named Sachin, Sehwag, Kohli name in Non-Honours Board XI
లార్డ్​లో 'నాన్​హానర్స్​' బోర్డు

ఇదీ చదవండి: ఆసీస్​ పర్యటన యథాతథం.. అడిలైడ్​లోనే గులాబీ టెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.