ETV Bharat / sports

కేఎల్​ రాహుల్​ కాదు పంత్​ సరైనోడు :​ లారా - వికెట్​ కీపింగ్​ కేఎల్​ రాహుల్​ లారా

భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్​మన్​గా పంత్ సరైన వ్యక్తి అని దిగ్గజ లారా చెప్పాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్​పై పూర్తిగా దృష్టి పెట్టాలని తెలిపాడు.

Lara
బ్రయాన్ లారా
author img

By

Published : Oct 7, 2020, 3:58 PM IST

Updated : Oct 7, 2020, 4:28 PM IST

టీమ్​ఇండియా క్రికెటర్​ కేఎల్​ రాహుల్​.. వికెట్​ కీపింగ్ గురించి ఆలోచించడం మానేసి బ్యాటింగ్​పై దృష్టి పెట్టాలని వెస్డిండీస్​ దిగ్గజం బ్రయాన్‌ లారా సూచించాడు. భారత జట్టులో వికెట్​కీపర్​ స్థానానికి పంత్​కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. ధోనీకి సరైనా వారసుడు అతడే అని అన్నాడు.

"కేఎల్​ రాహుల్ గొప్ప బ్యాట్స్​మన్​. అతడు​ వికెట్​కీపింగ్​పై కాకుండా బ్యాటింగ్​ మీద దృష్టిపెట్టడం మంచిది. ఎక్కువ పరుగులు సాధించే దిశగా కృషి చేయాలి. రిషభ్​ పంత్​ వికెట్​ కీపర్​,బ్యాట్స్​మన్​గా బాగా రాణించలగడు. గతేడాది నుంచి అతడు తిరిగి ఫామ్​లోకి వచ్చాడు. ఈ ఐపీఎల్​లో అతడి ప్రదర్శనే నిదర్శనం"

-బ్రయాన్​ లారా, వెస్టిండీస్​ మాజీ క్రికెటర్

దిల్లీ క్యాపిటల్స్​కు ఆడుతున్న పంత్.. ఈ ఐపీఎల్​లో బాగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 171 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టుకు వికెట్ కీపర్​గా ఇతడే సరైన ఎంపిక అని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే లారా మాట్లాడాడు.

"అతడు క్లాస్​ ప్లేయర్​. ఈ మెగాలీగ్​లో తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మరింతగా రాణిస్తాడు" అని సంజూ శాంసన్ గురించి లారా చెప్పాడు.

ఇదీ చూడండి నాన్న చెప్పారు.. అందుకే ఐపీఎల్ ఆడుతున్నా: స్టోక్స్

Last Updated : Oct 7, 2020, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.