ETV Bharat / sports

'జాతి వివక్ష అనే వైరస్​ను ఏ మాస్క్​ అడ్డుకుంటుంది?' - జాతి వివక్ష పై లక్ష్మీపతి బాలాజీ

మెదడుపై ప్రభావం చూపే జాతివివక్ష అనే వైరస్​ను నివారించేందుకు ఏ మాస్క్​ అడ్డుగా నిలుస్తుందని ప్రశ్నించాడు టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ లక్ష్మీపతి బాలాజీ. ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చాడు.

Lakshmipathi Balaji
లక్ష్మీపతి బాలాజీ
author img

By

Published : Jun 15, 2020, 8:09 PM IST

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరూ ఎలాంటి పరిస్థితుల్లోనూ వివక్షకు గురికాకూడదని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ లక్ష్మీపతి బాలాజీ అన్నాడు. ఇటీవల అమెరికాలో ఓ పోలీస్‌ అధికారి ప్రవర్తించిన తీరుకు జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే ఆఫ్రికన్‌ అమెరికన్‌ మృతిచెందాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా జాతివివక్షపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే క్రీడా రంగంలోనూ జాత్యాహంకార వివక్ష ఉందని పలువురు క్రీడాకారులు ఈ మధ్య ఆరోపించారు. తాజాగా దీనిపై బాలాజీ స్పందించాడు.

"స్కూలు, కాలేజీ, లేదా ఏ రంగమైనా కొందరు వ్యక్తులు ఉంటారు. వాళ్లు ఇతరుల బలహీనతలను లక్ష్యంగా చేసుకొని బాధపెడతారు. వాటిని అరికట్టడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. అయితే, వాటి తీవ్రత ఎంత అనేది బాధితులు గుర్తించాలి. ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చింది. దీన్ని ఎవరూ నిర్మూలించలేరు. మన జీవితాల మీదున్న భయంతో సామాజిక పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. అయితే, మన మెదడుపై ప్రభావం చూపే వైరస్‌(జాతివివక్ష) పట్ల ఏ మాస్క్‌ అడ్డుగా నిలుస్తుంది?" అని బాలాజీ ప్రశ్నించాడు.

అలాగే తాను 7వ తరగతిలో ఫెయిల్‌ అయ్యానని.. దాంతో అవమానాలు ఎదుర్కొన్నానని వివరించాడు.

"నేను 12 ఏళ్ల వయసులో ఉండగా 7వ తరగతి తప్పాను. ఒక నిర్దిష్ట వయసుకు వచ్చాక మళ్లీ ఒక క్లాస్‌ చదవాలంటే అది ఎంతో అవమానకరంగా ఉంటుంది. సామాజిక పరిస్థితుల కారణంగా ఆ అవమానాలు ఎదుర్కొన్నా. తర్వాత నా వల్ల తల్లిదండ్రులు బాధపడ్డారని తెలిసి పశ్చాత్తాపం చెందా. అది వాళ్లకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ ఒక్క సంఘటన నన్ను మానసికంగా బాధపెట్టింది. అదృష్టం కొద్ది నా తల్లిదండ్రులు వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. లేకపోతే అలాంటి చిన్న వయసులో సామాజిక ఒత్తిళ్ల కారణంగా చిన్నపిల్లలు తీవ్ర నిర్ణయాలు తీసుకునే వీలుంది. నా తల్లిదండ్రుల మూలంగా నేనా పరిస్థితుల నుంచి బయటపడ్డా. వాళ్ల అవగాహనకు ధన్యవాదాలు. కానీ, అందరు తల్లిదండ్రులు ఇలా ఉండకపోవచ్చు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవర్నీ వివక్షతో చూడొద్దు. వాళ్లు చిన్నపిల్లలైనా.. పెద్దవాళ్లైనా. ఈ సంఘటన జరిగి 25 ఏళ్లు దాటింది. ఇప్పటికీ ఆ గాయం మానలేదు. అలాంటి పరిస్థితులు చిన్నప్పుడే దాటిరావడం వల్ల.. జీవితంలో, కెరీర్‌లో ఎదురైన సవాళ్లను అధిగమించడం తేలికైంది."

-లక్ష్మీపతి బాలాజీ, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

తన కెరీర్​లో మొత్తంగా ఎనిమిది టెస్టులు, 30 వన్డేలు, ఐదు టీ20లు ఆడాడు లక్ష్మీపతి బాలాజీ.

ఇది చూడండి : ఎక్స్​క్లూజివ్: 'ఒలింపిక్స్​లో బంగారు పతకం సాధిస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.