ETV Bharat / sports

తెలుగు హిట్ సినిమా గురించి భారత క్రికెటర్ల చర్చ - అశ్విన్ హనుమ విహారి వీడియోకాల్

ఇన్​స్టా లైవ్​లో టీమిండియా క్రికెటర్లు అశ్విన్, హనుమ విహారి.. ఇటీవలే వచ్చిన 'భీష్మ' గురించి మాట్లాడుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను దర్శకుడు వెంకీ కుడుముల ట్వీట్ చేశారు.

'భీష్మ' సినిమా గురించి భారత క్రికెటర్ల చర్చ
అశ్విన్​తో మాట్లాడుతున్న విహారి
author img

By

Published : Apr 28, 2020, 1:40 PM IST

లాక్​డౌన్​తో ఇళ్లకే పరిమితమైన భారత క్రికెటర్లు.. స్నేహితుల్ని, సహచరుల్ని చాలా మిస్ అవుతున్నారు. దీంతో వీడియోకాల్స్​ చేస్తూ ముచ్చటిస్తున్నారు. ఇలానే మాట్లాడుకున్న భారత క్రికెటర్లు అశ్విన్, హనుమ విహారి.. 'భీష్మ' సినిమా గురించి చర్చించుకున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ట్వీట్ చేశారు. దీనికి రీట్వీట్ చేసిన హనుమ.. చిత్రం చూస్తూ చాలా ఎంజాయ్ చేశానని పేర్కొన్నాడు.

ఇందులో భాగంగా అశ్విన్.. ఏ సినిమా ఇష్టమని విహారిని తెలుగులో అడిగాడు. ఇటీవలే 'భీష్మ' చూశానని, ఫుల్ కామెడీగా ఉందని పేర్కొన్నాడు. హీరో ఎవరని అడగ్గా, నితిన్ అని హనుమ చెప్పాడు. అయితే తమ ఇంట్లోనూ అందరు పాత సినిమాలు చూస్తున్నారని, తాము తెలుగు చిత్రాలకు పెద్ద అభిమానులమని అశ్విన్ తెలిపాడు.

తన సినిమా గురించి భారత క్రికెటర్లు మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు దర్శకుడు వెంకీ కుడుముల. 'భీష్మ'ను ఇష్టపడుతున్నందుకు హనుమ విహారికి, తెలుగు సినిమాలను ప్రేమిస్తున్నందుకు అశ్విన్​కు కృతజ్ఞతలు చెప్పారు.

nithiin rashmika in beeshma
భీష్మ సినిమాలో నితిన్-రష్మిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.