క్రికెట్ అభిమానులకు శుభవార్త. డిసెంబరులో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే బాక్సింగ్ డే టెస్టుకు ప్రేక్షకులను అనుమతించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అక్కడ కరోనా కేసుల తగ్గుముఖంతో సోమవారం లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. ఈ నేపథ్యంలోనే స్డేడియానికి ప్రేక్షకులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంపై సమాలోచనలు జరుపుతున్నారు.
అయితే
వచ్చే వారం జరగనున్న మెల్‌బోర్న్ కప్ గుర్రపు పందేల పోటీలకు అభిమానులను
అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నప్పటికీ.. డిసెంబరు నెలాఖర్లో బాక్సింగ్
డే టెస్టు మాత్రం ప్రేక్షకుల నడుమ జరిగే వీలుందని విక్టోరియా రాష్ట్ర
ప్రీమియర్ డానియల్ ఆండ్రూస్ సోమవారం ప్రకటించారు.
నవంబర్‌లో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా-భారత్ పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిడ్నీ, కాన్బెర్రా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మైదానాల్లోనే మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనున్నాయి ఇరుజట్లు. అయితే ఈ పర్యటనలో భాగంగా టీమిండియా తొలుత సిడ్నీకి చేరుకోనుంది. అక్కడే 14 రోజుల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకొని ప్రాక్టీస్‌లో పాల్గొంటుంది. తుది జట్టులో పాల్గొనే ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వచ్చే వారం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చూడండి వారెవ్వా ఇక్రామ్.. చేతుల్లేకపోయినా ఆడేస్తున్నాడు