ETV Bharat / sports

టీమ్​ఇండియా గెలవాలంటే మార్పులు అనివార్యమా? - నటరాజన్, కుల్దీప్​లకు అవకాశం

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే సిరీస్​లో టీమ్​ఇండియా వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. దీంతో జట్టు కూర్పుతో పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్సీపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య రేపు (బుధవారం) తుదిపోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్​లో బౌలింగ్​లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.

IND v AUS 2020
టీమ్​ఇండియా గెలవాలంటే మార్పులు అనివార్యమా?
author img

By

Published : Dec 1, 2020, 7:33 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే సిరీస్​లో దారుణంగా విఫలమవుతోంది భారత జట్టు. ఆడిన రెండు వన్డేల్లోనూ ఓటమిపాలై సిరీస్​ను చేజార్చుకుంది. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపైనా విమర్శలు వస్తున్నాయి. జట్టు కూర్పుపైనా పలువురు మాజీలు పెదవి విరుస్తున్నారు. మూడో వన్డేలోనైనా టీమ్​ఇండియా మార్పులు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్​ కోసం భారత్ ఏ మార్పులు చేస్తే బాగుంటుందో ఓసారి చూద్దాం.

బ్యాటింగ్​లో నో ఛేంజెస్!

దాదాపు ఇదే బ్యాటింగ్ లైనప్​ను తరువాతి మ్యాచ్​లోనూ కొనసాగిస్తే బాగుంటుందనేది విశ్లేషకుల మాట. 'ఒకవేళ మయాంక్ అగర్వాల్​ను తప్పించాలని చూసినా అది ఎందుకూ ఉపయోగపడదు. అందువల్ల అతడికి మరో అవకాశం ఇవ్వడం మంచిదే. అలాగే కేఎల్ రాహుల్​ను ఐదో స్థానంలోనే కొనసాగిస్తే బాగుంటుందనేది' మాజీల అభిప్రాయం.

IND v AUS 2020
భారత్-ఆస్ట్రేలియా

పాండేకు అవకాశం?

రాహుల్​తో ఓపెనింగ్ చేయించి మనీశ్ పాండేను మిడిలార్డర్​లో ఆడిస్తే బాగుంటుందనే పలువురు అంటున్నారు. వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కూడా ఇదే విషయమై మాట్లాడూతూ.. "కేవలం చివరి మ్యాచ్​ కోసం పాండేను జట్టులోకి తీసుకుని.. రాహుల్​ను ఓపెనింగ్​ పంపడం సరైంది కాదు" అని తెలిపాడు. కానీ ఆ మార్పులు జరిగే అవకాశం లేకపోలేదని వెల్లడించాడు.

IND v AUS 2020
చాహల్

బౌలింగ్​లో మార్పులు

ఈ మ్యాచ్​లో నవదీప్ సైనీ, చాహల్ బదులు నటరాజన్, కుల్దీప్​ యాదవ్​కు అవకాశం ఇవ్వాలని అంటున్నారు మాజీలు. ఒకవేళ అవకాశం ఇస్తే వారు నిరూపించుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఫిట్​నెస్ సమస్యలు రానంతవరకు బుమ్రా, షమీని జట్టులో కొనసాగించాలని అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.