పాకిస్థాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ వాహబ్ రియాజ్ టెస్టులకు గుడ్‌బై చెప్పడానికి గల కారణాలను వెల్లడించాడు. జాతీయ సెలక్టర్లు తనపై పదేపదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. 2018 అక్టోబర్ నుంచి పాకిస్థాన్ టెస్టు జట్టుకు తనను ఎంపిక చేయలేదని వాహబ్ గుర్తు చేశాడు.
"నేను 2017, అక్టోబరులో టెస్టు మ్యాచ్ ఆడాను. ఏడాది తర్వాత ఆస్ట్రేలియాతో ఫ్లాట్ పిచ్‌పై ఆడే మరో అవకాశం వచ్చింది. అనంతరం నన్ను మరోసారి ఏడాదికి పైగా తొలగించారు.
-వాహబ్ రియాజ్, పాక్ క్రికెటర్
అందుకే తొలగింపు..
2010లో ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన వాహబ్తో పాటు, తోటి పేసర్ మహ్మద్ ఆమిర్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తొలగించింది. పాక్‌కు అవసరమైన సమయంలో టెస్టు మ్యాచ్‌కు గుడ్‌బై చెప్పడం వల్లే ఇరువురిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా టీ20, వన్డేలపై దృష్టి పెడితే మంచిదని భావిస్తున్నట్లు వాహబ్ తెలిపాడు. తనకు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందడం కంటే పాక్ తరఫున ఆడటమే ముఖ్యమని స్పష్టం చేశాడు.
మొహాలీ వేదికగా 2011 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన సెమీఫైనల్లో 5 వికెట్లు తీశాడు వాహబ్. అప్పటి నుంచి క్రికెట్ అభిమానులకు సపరిచితమయ్యాడు. వాహబ్ 27టెస్టులు, 89 వన్డేలు, 31 టీ20 మ్యాచ్‌లు ఆడి.. మొత్తం 228 వికెట్లు తీశాడు.