ETV Bharat / sports

తొలి బంతిని ఎదుర్కోవడం ఇష్టముండదు: ధావన్ - ధావన్ ఇన్​స్టా లైవ్

తనకు తొలి బంతిని ఎదుర్కోవడం ఇష్టముండదని చెప్పాడు టీమ్​ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్. కొన్ని విషయాలను తాను ఎప్పుడూ మార్చుకోలేనని స్పష్టం చేశాడు. తన గురించి రోహిత్, వార్నర్ చెప్పిన మాటలతో ఏకీభవించనని తెలిపాడు.

ధావన్
ధావన్
author img

By

Published : May 14, 2020, 6:01 PM IST

కరోనా వైరస్‌ పుణ్యమా అని ఇంటికే పరిమితమైన క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక ఇంటర్వ్యూలు, లైవ్‌చాట్లతో బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు ఆసక్తికర వ్యాఖ్యలు, విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌.. రోహిత్‌శర్మ, డేవిడ్‌ వార్నర్‌ తన గురించి చేసిన వ్యాఖ్యలపై ఇన్​స్టా లైవ్​లో మాట్లాడాడు.

రోహిత్‌ టీమ్‌ఇండియాలో ధావన్‌కు జోడీగా కొనసాగుతుండగా, వార్నర్‌ ఐపీఎల్‌లో గబ్బర్​తో ఓపెనింగ్‌ చేశాడు. బుధవారం రోహిత్‌, వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడుతూ ధావన్‌ ఓపెనింగ్‌ బ్యాటింగ్‌పై కామెంట్లు చేశారు. తొలుత వార్నర్‌ మాట్లాడుతూ.."శిఖర్‌ ధావన్‌ తొలి బంతిని ఎదుర్కోవడం నేను చూసిన ఒకే ఒక సందర్భం హర్భజన్‌సింగ్‌ బౌలింగ్‌లోనే. అతనెప్పుడూ నాతో ఒక మాట అంటాడు. 'ఓపెనింగ్‌ బౌలర్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ అయితే, నువ్వే బ్యాటింగ్‌ ఆరంభించు. నాకు ఇన్‌కమింగ్‌ డెలివరీని ఎదుర్కోవడం ఇష్టం ఉండదు' అని అంటాడు" అని చెప్పాడు.

రోహిత్‌ స్పందిస్తూ.."ధావన్‌ ఒక ఇడియట్‌, నేనేం చెప్పగలను?తనకు తొలి బంతిని ఎదుర్కోవడం ఇష్టం ఉండదు. స్పిన్నర్లను ఎదుర్కోవడమే ఇష్టం. ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కోవడానికి ఇష్టపడడు" అని వ్యాఖ్యానించాడు. ఇదే విషయాన్ని ఇర్ఫాన్‌ పఠాన్‌.. శిఖర్ ‌ధావన్‌ను మరో లైవ్‌చాట్‌లో ప్రశ్నించగా గబ్బర్‌ స్పష్టతనిచ్చాడు. తనకు నిజంగానే తొలి బంతిని ఎదుర్కోవడం ఇష్టం ఉండదని.. అయితే, ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కోవడం ఇష్టం ఉండదనే వ్యాఖ్య మాత్రం తప్పని చెప్పాడు. "అది కచ్చితంగా తప్పు. నేనా ఆ వ్యాఖ్యను ఒప్పుకోను. నాకు ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కోవడం ఇష్టం ఉండదని కాదు, ప్రతి ఒక్కరికీ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. నేనొక ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌. టీమ్‌ఇండియాకు 8 ఏళ్లుగా అదే పనిచేస్తున్నా. కాబట్టి, కచ్చితంగా ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కొంటా. ఒకవేళ తొలి ఓవర్‌లో వారిని ఆడకపోతే రెండో ఓవర్‌లోనైనా ఆడక తప్పదు" అని ధావన్‌ చెప్పాడు.

కానీ, తనకు తొలి బంతిని ఎదుర్కోవడం మాత్రం ఇష్టముండదని అన్నాడు. ఈ విషయానికి కట్టుబడే ఉంటానన్నాడు. అయితే, టీమ్‌ఇండియాలో పృథ్వీషా లాంటి కొత్త కుర్రాడొచ్చి తొలి బంతిని ఆడలేనంటే మాత్రం తాను ఓపెనింగ్‌ చేస్తానని తెలిపాడు. ఇక రోహిత్‌ విషయానికొస్తే, ఒకసారి ఛాంపియన్స్‌ ట్రోఫీలో అతడినే ఓపెనింగ్‌ చేయమని అడిగానని, అది అలాగే కొనసాగుతోందని వివరించాడు. కొన్ని విషయాలను తాను మార్చుకోలేనని స్పష్టంచేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.