తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త తనకు రూ.4 కోట్లు మోసం చేశాడని టీమ్‌ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ స్నేహితుడి ద్వారా పరిచయమైన మహేశ్‌కు 2015లో రూ.4 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు ఫిర్యాదులో భజ్జీ పేర్కొన్నాడు. డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ ఎన్నిసార్లు అడిగినా మహేశ్ కాలయాపన చేశాడని తెలిపాడు. గత నెలలో మహేశ్ ఇచ్చిన రూ.25 లక్షల చెక్కు బౌన్స్ కావడం వల్ల హర్భజన్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
రూ.4 కోట్లు మోసపోయిన బౌలర్ హర్భజన్ సింగ్!
చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్త, సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను మోసం చేశాడు. రూ.4 కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వడంలో కాలయాపన చేస్తున్నాడని భజ్జీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.