మలింగ.. ఈ పేరు వినగానే ఉంగరాల జట్టు.. విభిన్న బౌలింగ్ శైలి గుర్తుకొస్తాయి. తన కెరీర్లో ఎన్నో రికార్డులు, జ్ఞాపకాలను సంపాదించుకుని వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడీ లంక బౌలర్. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌తో తన వన్డే కెరీర్‌ను ముగించాడు. అతడి రిటైర్మెంట్పై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు టీమిండియా క్రికెటర్లు.
"ఈ పదేళ్ల ముంబయి ఇండియన్స్ ప్రయాణంలో మ్యాచ్ విన్నర్ ఎవరని అడిగితే... సమాధానం లసిత్ మలింగనే. క్లిష్ట పరిస్థితుల్లో నాకు ఎంతో సాయం చేశాడు. వైవిధ్యమైన బంతుల్ని సంధిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. భవిష్యత్తులో అతడికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా". -రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్
"నీ బౌలింగ్ స్పెల్ క్లాసిక్. క్రికెట్‌కు నీవు చేసిన అద్భుతమైన సేవలకు ధన్యవాదాలు. నువ్వంటే నాకు ఎల్లప్పుడూ అభిమానమే, దాన్ని అలానే కొనసాగిస్తాను."
-బుమ్రా, టీమిండియా ఆటగాడు
"అద్భుతమైన నీ వన్డే కెరీర్‌కు అభినందనలు. భవిష్యత్తులో నీకు అంతా మంచి జరగాలని ఆశిస్తున్నా". -సచిన్ తెందూల్కర్, టీమిండియా మాజీ క్రికెటర్
-
Congratulations on a wonderful One Day career, #Malinga.
— Sachin Tendulkar (@sachin_rt) July 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Wishing you all the very best for the future. pic.twitter.com/RLeKIudyWl
">Congratulations on a wonderful One Day career, #Malinga.
— Sachin Tendulkar (@sachin_rt) July 26, 2019
Wishing you all the very best for the future. pic.twitter.com/RLeKIudyWlCongratulations on a wonderful One Day career, #Malinga.
— Sachin Tendulkar (@sachin_rt) July 26, 2019
Wishing you all the very best for the future. pic.twitter.com/RLeKIudyWl
బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ వన్డేలో 9.4 ఓవర్లు వేసిన మలింగ.. 38 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
15 ఏళ్ల వన్డే కెరీర్లో 329 మ్యాచ్‌లు ఆడి 536 వికెట్లు పడగొట్టాడు మలింగ. యార్కర్ స్పెషలిస్టుగా పేరు సంపాదించాడు. వన్డే క్రికెట్లో మూడు హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 2011లో టెస్టు క్రికెట్‌కు మలింగ వీడ్కోలు పలికాడు.
ఇవీ చూడండి.. వీడ్కోలు మ్యాచ్ చివరి బంతికి మలింగ వికెట్