ETV Bharat / sports

కివీస్ క్రికెటర్ అండర్సన్ రిటైర్మెంట్ - అమెరికా మేజర్ క్రికెట్ లీగ్

న్యూజిలాండ్ ఆల్​రౌండర్ కోరె అండర్సన్.. యుక్త వయసులోనే అంతర్జాతీయ కెరీర్​కు ముగింపు పలికాడు. అమెరికన్ లీగ్​లో పాల్గొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

Corey Anderson retires from New Zealand, signs for USA's Major league cricket
వేగవంతమైన సెంచరీ చేసిన క్రికెటర్ రిటైర్మెంట్
author img

By

Published : Dec 5, 2020, 11:22 AM IST

Updated : Dec 5, 2020, 12:20 PM IST

న్యూజిలాండ్​ యువ క్రికెటర్ కోరె అండర్సన్​.. 29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు. అమెరికాలోని మేజర్ క్రికెట్ లీగ్​లో ఆడేందుకు మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలోనే వీడ్కోలు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అలాగే కివీస్​ జట్టు తరఫున ఆడినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి.. ఈ ఆల్​రౌండర్ 93 అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడాడు.

"ఇది అంత సులువైన నిర్ణయం కాదు. నాకు నేను ఎన్నో ప్రశ్నలు వేసుకున్నా. రానున్న రెండు, ఐదేళ్లు, పదేళ్లలో ఏం చేయాలా అని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో నా భార్య మేరీ మార్గరెట్​ పాత్ర కూడా ఎంతో ఉంది. నా కోసం అమెరికా నుంచి న్యూజిలాండ్ వచ్చి జీవించింది. ప్రతి క్షణం నా వెన్నంటే ఉంది. అందుకే ఆమె కోసం, జీవితంలో మార్పు కోసం అమెరికా వెళ్లాలని భావించా" అని అండర్సన్​ చెప్పాడు.

Corey Anderson retires from New Zealand
కోరె అండర్సన్

వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ(2013లో వెస్టిండీస్​పై) చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు అండర్సన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ముంబయి ఇండియన్స్​కు ఆడాడు. తర్వాత ఫామ్​ లేమి కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. చివరి వన్డే 2017 జూన్​లో బంగ్లాదేశ్​పై, చివరి టీ20 2018లో పాకిస్థాన్​పై ఆడాడు.

Last Updated : Dec 5, 2020, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.