ETV Bharat / sports

సోదరుడికి కరోనా.. హోం క్వారంటైన్​లో గంగూలీ

క్యాబ్​ కార్యదర్శిగా చేస్తున్న తన సోదరుడు స్నేహాశిష్​కు కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ హోం క్వారంటైన్​లోకి వెళ్లారు.

సోదరుడికి కరోనా.. హోం క్వారంటైన్​లో గంగూలీ
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ
author img

By

Published : Jul 16, 2020, 7:31 AM IST

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సోదరుడు స్నేహశిష్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆయన్ను ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో దాదా హోం క్వారంటైన్​లోకి వెళ్లారు. స్నేహాశిష్ ప్రస్తుతం బంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ganguly with snehasish
సోదరుడు స్నేహాశిష్​తో సౌరభ్ గంగూలీ

కొన్నిరోజుల క్రితం తన భార్య, అత్తమామలకు కరోనా పాజిటివ్​ రావడం వల్ల స్నేహాశిష్, గంగూలీ ఉంటున్న ఇంట్లోకి మారారు. ఇప్పుడు ఈయనకు వైరస్​ సోకినట్లు తేలింది. దీంతో దాదా, క్వారంటైన్​లోకి వెళ్లారు.

అయితే గత నెలలోనే స్నేహాశిష్​కు కరోనా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లేనని, తాను ఆరోగ్యంగా ఉన్నట్లు అప్పుడు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.