బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు డెవలప్మెంట్ కోచ్ ఆషికుర్ రెహమాన్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో తానే స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశాడు.
"సోమవారం చేసిన పరీక్షల్లో నాకు కొవిడ్-19 సోకిందని వైద్యులు స్పష్టం చేశారు. మొదట్లో నాకు అంతగా అర్ధమయ్యేది కాదు. గొంతులోని టాన్సిల్స్‌లో వాపు కారణంగా గొంతునొప్పి వచ్చిందని అనుకున్నా. క్రమంగా జ్వరంతో పాటు ఛాతి నొప్పి వచ్చింది. అనుమానం వచ్చి డాక్టర్లను సంప్రదిస్తే వైరస్ సోకిందని తెలిసింది".
- ఆషికుర్ రెహమాన్, బంగ్లాదేశ్ డెవలప్మెంట్ కోచ్
రెహమాన్.. 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లకు, 18 మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్-ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2002లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ జట్టులోనూ సభ్యుడు. కానీ, ఆ దేశ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. ఇతడు ఇప్పటికే బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు.
ఇదీ చూడండి.. 'టీమ్ఇండియా ఆటగాళ్లకు సలహాలు ఇచ్చేవారే లేరు'