ETV Bharat / sports

మాజీ క్రికెటర్ కైఫ్ జీవితాన్నే మార్చేసిన ఆ మ్యాచ్!​

నాట్​వెస్ట్​ ఫైనల్​కు 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ మ్యాచ్​ను గుర్తు చేసుకున్నాడు మాజీ క్రికెటర్ కైఫ్.​ తన జీవితాన్నే మార్చేసిందని చెప్పాడు.

mohammed
మహ్మద్​
author img

By

Published : Jul 13, 2020, 12:01 PM IST

సరిగ్గా 18 ఏళ్ల క్రితం జరిగిన నాట్​వెస్ట్ ఫైనల్​ను గుర్తు చేసుకున్నాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. ఆ మ్యాచ్ తన జీవితాన్నే మార్చేసిందని, ఎప్పటికీ​ ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పాడు. అందుకే 2018లో అదే తేదీన రిటైర్మెంట్​ ప్రకటించినట్లు వెల్లడించాడు. 2002 జులై 13న లార్డ్స్​లో జరిగిన తుదిపోరులో ఇంగ్లాండ్​పై భారత్ అద్భుత విజయం సాధించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"జులై 13కూ నాకు దగ్గర అనుబంధం ఉంటుంది. నా జీవితాన్నే మార్చేసిన ఆ తేదీని ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే 2018లో అదే రోజున రిటైర్మెంట్​ ప్రకటించాను. 2002 నాట్​​వెస్ట్​ ఫైనల్లో నేను ఎదుర్కొన్న అనుభవాన్ని అప్పటివరకు ఎదుర్కోలేదు. తుది పోరులో ఇంగ్లాండ్​పై గెలిచేందుకు ఎన్నో ప్రణాళికలు వేయడం సహా చర్చలు జరిపాం. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్​లో ఓడిపోతామని భావించినా చివరకు విజేతగా నిలిచాం"

-మహ్మద్​ కైఫ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

ఈ ఫైనల్లో 326 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. ఇన్నింగ్స్‌ను అద్భుతంగానే ఆరంభించింది. అనంతరం పుంజుకున్న ఇంగ్లాండ్‌ బౌలర్లు 146 పరుగులకే 5 కీలక వికెట్లు పడగొట్టి పైచేయి సాధించారు. దీంతో జట్టు కష్టాల్లోకి వెళ్లింది. ఆ సమయంలో యువరాజ్​-కైఫ్ కలిసి ఆరో వికెట్‌కు​ 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 69 పరుగులు చేసి యువీ ఔటైనప్పటికీ.. కైఫ్​ మాత్రం చెలరేగి ఆడాడు. ఫలితంగా రెండు వికెట్ల తేడాతో భారత్‌ విజయాన్ని అందుకుంది.

గంగూలీ చొక్కా విప్పిన వేళ

ఈ నాట్‌వెస్ట్‌ సిరీస్​లో టీమ్​ఇండియాకు సారథిగా వ్యవహరించాడు సౌరభ్‌ గంగూలీ. తుది పోరులో భారత్‌ విజయం సాధించగానే పట్టలేని ఆనందంతో చొక్కా విప్పిన దాదా.. దానిని గాల్లోకి తిప్పుతూ చేసిన సందడినీ ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు.

ganguly
గంగూలీ చొక్క విప్పిన వేళ

ఇది చూడండి : 'సూపర్​హీరో' దుస్తులతో జూనియర్​ ధావన్​ వంట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.