ETV Bharat / sports

Bumrah Ireland T20 : టీ20ల్లో బుమ్రా ఎంట్రీ.. అతని ముందున్న ఆ రెండు ఛాలెంజస్​ ఇవే.. - jasprit bumrah ireland

Bumrah Ireland T20 : ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్​లో పాల్గొని మరోసారి తన సత్తా చాటనున్నాడు టీమ్ఇండియా మాజీ పేసర్​ జస్ప్రీత్​ బుమ్రా. దాదాపు ఏడాదిగా క్రికెట్​కు దూరంగా ఉన్న బుమ్రాకు ఈ సిరీస్​లో సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది బీసీసీఐ. దీంతో ఇప్పుడే గాయం నుంచి కోలుకున్న అతనిపై వన్డే ప్రపంచకప్‌ ముంగిట ఇలా అనవసరమైన ఒత్తిడి ఎందుకు పెడుతున్నారంటూ ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు.

jasprit bumrah
jasprit bumrah
author img

By

Published : Aug 1, 2023, 7:55 PM IST

Bumrah Ireland T20 : టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా సూమారు ఏడాది నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా అతను ఫిట్​నెస్​ టెస్ట్​ను అధిగమించి మైదానంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఐర్లాండ్‌తో ఆగస్ట్‌ 18 నుంచి జరగనున్న టీ20 సిరీస్​లో పాల్గొని మరోసారి తన సత్తా చాటనున్నాడు. అయితే ఈ సారి మేనేజ్​మెంట్​ అతని విషయంలో గట్టి నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్​ టీ20లో అడుగుపెట్టనున్న బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువరించింది. బీసీసీఐ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం క్రికెట్​ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడే గాయం నుంచి కోలుకున్న అతనిపై వన్డే ప్రపంచకప్‌ ముంగిట ఇలా అనవసరమైన ఒత్తిడి ఎందుకు పెడుతున్నారంటూ ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు. అయితే భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం బుమ్రాకు ఇది రెండోసారి. గతంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు (రీషెడ్యూల్‌ చేసిన మ్యాచ్)ను టీమ్​ఇండియా బుమ్రా నాయకత్వంలోనే ఆడింది.

మరోవైపు ఐర్లాండ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌ తర్వాత భారత జట్టు నేరుగా ఆసియా కప్‌లోనే తలపడనుంది. ఈ క్రమంలో వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ మినీ టోర్నీ కోసం టీమ్​ఇండియా అన్ని రకాలుగా సిద్ధమౌతోంది. అందుకోసమే..తాజాగా జరుగుతున్న విండీస్‌ సిరీస్‌లోనూ బ్యాటింగ్‌ ఆర్డర్‌ విషయంలోనూ పలు ప్రయోగాలు చేస్తోంది. ఫలితాన్ని పక్కనబెట్టి ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో మేనేజ్​మెంట్​ ​ చేస్తున్న పని అభినందనీయమే అయినప్పటికీ.. ఇటువంటి కీలక సమయాల్లో ప్రయోగాలు అవసరం లేదనేది క్రికెట్‌ మాజీల అభిప్రాయం. కానీ బుమ్రా విషయంలో బీసీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రయోగం అనే కన్నా రానున్న ఆసిస్​ సిరీస్​కు అతడ్ని రెడీ చేసేందుకే ఐర్లాండ్‌ సిరీస్‌ బాధ్యతలు అతనికి అప్పజెప్పిందని భావించాలి.

ఈ క్రమంలో ఏడాది తర్వాత స్టేడియంలోకి ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా.. ఆసియా కప్‌కు తనను తాను సన్నద్ధం చేసుకునేందుకు ఐర్లాండ్‌ సిరీస్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. అంతేగానీ సారథ్య బాధ్యతల విషయంలో అతడిపై ఎలాంటి అదనపు ఒత్తిడి ఉండదు. ఇప్పటికే ఇంగ్లాండ్‌ లాంటి జట్టుపై నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం బుమ్రా వద్ద ఉండటం వల్ల ఈ సారి కూడా తాను సత్తా చాటుతాడని అందరూ భావిస్తున్నారు.

మళ్లీ గాయపడకుండా..
India squad for Ireland T20Is: ఇక ఐర్లాండ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌ను బుమ్రా తన ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలి. బౌలింగ్‌ రన్నప్​తో పాటు బాల్​ను సంధించే తీరు, ఫీల్డింగ్‌ ఫిట్‌నెస్‌ తనకు ఉందో లేదో అన్న విషయాన్ని ఈ వేదికగా పరీక్షించుకునే అవకాశం ఈ సిరీస్​తో లభిస్తుంది. అంతే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లోకి బుమ్రా గ్రాండ్​ ఎంట్రీ ఇవ్వడానికి ఈ వేదిక సరైనదన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే, ఈ సిరీస్‌ సందర్భంగా బుమ్రా మరోసారి గాయాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓ వైపు తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూనే మరోవైపు బౌలింగ్‌ సత్తాను పరీక్షించుకోవాలి. అయితే, బుమ్రా వర్క్‌లోడ్‌ బ్యాలెన్స్​ చేసేందుకు టీమ్‌ మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అయితే ఈ మెగా టోర్నీలకు ముందు బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పడం సరైన నిర్ణయం కాదనేది కొందరి వాదన. అతనిపై అదనంగా ఒత్తిడి పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో.. బుమ్రా బౌలింగ్‌ తీరు ఎలా ఉండనుందో తెలుసుకోవాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.