Bumrah injury status : టీమ్ఇండియాకు అలాగే అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఐసీసీ ఈవెంట్లతో పాటుగా కీలక మ్యాచ్‌ల్లో బోల్తా కొడుతున్న భారత టీమ్‌కు ఊపిరి నిచ్చే వార్త ఇది. గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన స్పీడ్ గన్ బుమ్రా.. రీఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలిసింది. రీసెంట్గా ఈ స్పీడ్‌స్టర్ న్యూజిలాండ్‌లో సర్జరీ చేయించుకున్నాడు.
ireland team vs india : ఆ సిరీస్‌తో ఎంట్రీ.. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా పేస్ బౌలింగ్ అటాక్ అభిమానులకు కలవరపెడుతోంది. అయితే ఇప్పుడు తాజాగా అందిన వార్తతో అభిమానుల్లో జోష్ పెరిగింది. ఎందుకంటే ఆగస్టులో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమ్ ఇండియా.. ఐర్లాండ్ పర్యాటనకు వెళ్లనుంది. ఆగస్టు 18, 20, 23వ తేదీల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి బుమ్రా పునరాగమనం చేయనున్నాడని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లు ఇంగ్లీష్ కథనాలు వస్తున్నాయి. ఐర్లాండ్‌తో సిరీస్ ద్వారా బుమ్రా ఫిట్‌నెస్‌పై ఓ అంచనాకు రావొచ్చని మేనేజ్మెంట్ భావిస్తోందట. "అన్నీ సవ్యంగా జరిగితే బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో మైదానంలో బరిలోకి దిగుతాడు. ఐర్లాండ్ సిరీస్‌కు అతడు అందుబాటులో ఉంటాడు" అని బీసీసీఐ అధికారి చెప్పారట. కాగా, ప్రస్తుతం బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో వీవీఎస్ లక్ష్మణ్, నితిన్ పటేల్ పర్యవేక్షణలో బుమ్రా ఉన్నాడట.
Bumrah injury News : అప్పటి నుంచి దూరం.. వెన్నునొప్పి కారణంగా గతేడాది సెప్టెంబర్ నుంచి జట్టుకు దూరమయ్యాడు బుమ్రా. గాయం కారణంగా ఈ స్పీడ్‌స్టర్ గతేడాది ఆసియా కప్‌కు దూరమయ్యాడు. గాయం తిరగబెట్టడం వల్ల టీ20 వరల్డ్ కప్, శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లతో పాటు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచులు ఆడలేదు. దీంతో భారత జట్టు బౌలింగ్ బలహీనంగా మారింది. కీలక మ్యాచ్‌లలో టీమ్ఇండియా ఓటములను అందుకుంది.
వరల్డ్‌కప్‌లో కీలకం.. ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో బుమ్రా కీలకం కానున్నాడు. ఈలోగా అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. 2011లో ధోనీ కెప్టెన్సీలో కప్పును ముద్దాడిన టీమ్ఇండియా.. మళ్లీ ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని పట్టుదలతో ఉంది.
IPL 2023 GT VS MI : దంచికొట్టిన గుజరాత్.. సర్జరీ తర్వాత తొలిసారి స్టేడియంలో బుమ్రా